కీర్తనలు 5: 11
ప్రియులారా దేవుని ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువై ఉండదు. ఆయనను ఆశ్రయించువారు ఎల్లపుడు సంతోషంతో ఉంటారు.
రాహాబు అను వేశ్య దేవుని శక్తిని గురించి విని ఆయనను ఆశ్రయించింది. అందువల్ల తన ప్రాణమును, తన కుటుంబము వారి ప్రాణమును కాపాడుకుంది . తరువాత తన జీవితాంతము ఆనందంగా జీవించింది.
దేవుడు తనను ఆశ్రయించువారిని ఏ మాత్రము త్రోసివేయడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయనలా జీవించాలని ఆశపడిన వారిని దేవుడు ఎల్లవేళలా కాచి కాపాడుతాడు. ప్రియులారా మనకు నిజమైన సంతోషం దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఈ లోకంలో ఏదియు మనకు శాశ్వతమైన ఆనందం ఇవ్వలేదు అందుకే పౌలు భక్తుడు తనకు కలిగిన సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొని
దేవుని కొరకు శ్రమలు అనుభవించడానికి సిద్ధ పడ్డాడు
దేవునితో ఉన్నపుడే నిజమైన ఆనందాన్ని మనం పొందగలమని మనం గ్రహించాలి. కనుక ఈ లోకం ఇచ్చే ఆనందానికి ప్రాకులాడకుండా. దేవుడిని ఆశ్రయించి శాశ్వతమైన ఆనందం పొందుకుందాం
ఈ వాక్యము మనం దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించు వారమై యుండాలని మనకు తెలియజేస్తుంది గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుడు ఇచ్చు నిత్య జీవం పొందుకుందాం. దేవుడు మనకు తోడై నిత్యము మనని కాపాడును గాక. ఆమెన్
No comments:
Post a Comment