న్యాయాధిపతులు 5: 31
ప్రియులారా దేవున్ని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను పాటించడమే. ఎందుకంటే నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొనును అని దేవుడే చెబుతున్నాడు దేవుని ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారు నీతిమంతులుగా జీవిస్తారు. ఆ నీతిమంతులు సింహము వలే ధైర్యముగా ఉండగలరు
గొల్యాతును చూసి సౌలు రాజునూ ఇశ్రాయేలీయులు అందరు భయపడిపోయారు కానీ చిన్న వాడు అయినా దావీదు అతని ముందు ధైర్యముగా యుద్ధం చేసి అతనిని హతం చేసాడు. దావీదు దేవుణ్ణి ప్రేమించాడు గనుకనే దావీదు దేవుని యొద్ద శక్తిని పొండుకున్నాడు. దావీదును ఎదురుకోనుటకు ఫిలిప్పీయులలో ఎవరును రాలేదు. ఎందుకంటే దావీదు దేవుని బలము కలవాడై యుండెను గనుక
ప్రియులారా ఎవరైతే దేవుని ప్రేమించి ఆయనను హత్తుకొని జీవిస్తారో వారు ఈ లోకంలో ఎవరును ఎదురింపని గొప్ప శక్తి గలవారై ఉంటారు. వారు కీడు వస్తుందన్న భయం లేక జీవిస్తారు.
మనం కూడా ఆయనను ప్రేమించు వారమై దేవుని బలం కలిగి నిబ్బరంగా జీవిదాం.
ఈ వాక్యం మనం దేవుణ్ణి ప్రేమించువారమై యుండి ఆయన ఆజ్ఞలను గైకొనవలెనని తెలియజేస్తుంది.
గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని బలము గలవారమై జీవిదాం.
దేవుడు మనలను గొప్ప ధైర్యముతో నింపును గాక ఆమెన్.
No comments:
Post a Comment