యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును.
కీర్తనలు 29: 11
ప్రియులారా మన దేవుడు సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చువాడు శక్తి హీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఫిలిష్తీయులలో శూరుడైన గొల్యాతు ను గొర్రెల కాపరి గా ఉన్న దావీదు దేవుని బలము వలననే హతమార్చగలిగాడు
అలాగే బలహీనుడు అయిన గిద్యోనుకి బలాన్నిచ్చి
శత్రువుల నుండి తన ప్రజలను రక్షించాడు
మన దేవుడు నిన్న నేడు ఏక రీతిగా ఉన్న దేవుడు
ఆ ఘనుడైన దేవుడు ఇప్పుడు మనకు తోడై యున్నాడు ఈ లోకములో మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నాను ఆ పరిస్థితిలన్నింటిని ఎదిరించె గొప్ప బలాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తాడు
మనము ఎల్లప్పుడూ సమాధానం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు ఒకవేళ మనము ఏదైనా శోధనలో ఉన్నట్లయితే దేవుడు ఆ శోధనలను తట్టుకునే శక్తిని ఇస్తాడని నమ్మి ఆ శోధనలలోను దేవుడిచ్చు సమాధానము గలవారమై ఉందాం
ఈ వాక్యము దేవుడై మనకు బలాన్నిచ్చి ఎల్లవేళలా
మనకు సమాధానము కలుగజేయువాడనే నమ్మకాన్ని ఇస్తుంది గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన బలమును పొందిన అని సమాధానం గలవారమై ఉందాం. దేవుడు ఆయన శక్తి చేత మనలను నింపి సమాధానము చేత మన హృదయములను నింపును గాక
No comments:
Post a Comment