ఇశ్రాయేలు ప్రజలలో బెన్యామీను వంశంలో కీషు అనే పేరుగల ఒక ధనవంతుడుండేవాడు, అతని కుమారుడు సౌలు. సౌలు చాల అందమైనవాడు.
చాల ఎత్తయిన వాడు. ఒకసారి కీషు గాడిదలు తప్పిపోయాయి. సౌలు తండ్రి గాడిదల కోసం చాల దేశాలలో వెదికాడు. అలా వెదకుతూ 'సూపు' దేశం
చేరాడు. తన సేవకుని సలహా పాటించి సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. దేవుడు సమూయేలుకు ఈ విషయం ముందే తెలియచేశాడు. సమూయేలు
సౌలుతో “ఈ రాత్రి నావద్ద బస చేయండి. కనిపించని గార్ధభములను గురించి కంగారు పడకండి" అన్నాడు.
సమూయేలు సౌలును రాజుగా అభిషేకించుట :
మరునాడు సమూయేలు సౌలు తలమీద నూనె పోసి అతనిని ముద్దుపెట్టుకొని “యెహోవా నిన్ను అభిషేకించి, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించి యున్నాడు." అని చెప్పెను. “నీ తండ్రి గార్ధభములు దొరికాయని యిద్దరు సేవకులు వచ్చి చెప్తారు. తర్వాత ముగ్గురు మనుషులు ఎదురై నీకురొట్టెలు, ద్రాక్షారసం యిస్తారు. ఆ తర్వాత ప్రవక్తల గుంపు ఎదురవుతుంది.
నీవా ప్రవక్తలతో కలసి ప్రకటన చేస్తుండగా నీకు నూతన మనసు అనుగ్రహింపబడుతుంది. నీవు గిలులో వుండు నేను అక్కడికి వచ్చి, నీవు చేయవలసిన పనిని తెలియజేస్తాను" అని చెప్పాడు. సౌలు ప్రవక్త చెప్పినట్లు చేశాడు. అతడు ఆత్మపూర్ణుడై ప్రవక్తలతో పాటు ప్రకటన చేయసాగాడు దేవుడు
సౌలును ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేశాడని ప్రవక్త చెప్పినప్పుడు ప్రజలందరు "రాజు చిరంజీవి అగుగాక" అని పెద్దగా నినాదాలు చేశారు.
సౌలు రాజు దహనబలి అర్పించుట : ఆజ్ఞ మీరుట :
సౌలు 20 సం||ల వయస్సులో ఇశ్రాయేలు వారికి రాజు అయ్యాడు. ఫిలిప్తీయులు గొప్ప సైన్యంతో ఇశ్రాయేలు రాజ్యం పై దండెత్తారు. ఇశ్రాయేలు సైన్యం భయపడి పారిపోయింది. ఈ క్లిష్ట పరిస్థితిలో సౌలు రాజు తొందరపడి తానే యెహోవాకు దహనబలి అర్పించాడు. “యెహోవా నిన్ను చిరకాలము
రాజుగా వుంచాలనుకొన్నాడు. కాని నీవు తొందరపడి, చేయరాని పని చేశావు కాబట్టి నీ అధికారము నిలవదు, యెహోవా నీ బదులు వేరొకరిని రాజుగా
నియమిస్తాడు” అని సమూయేలు చెప్పాడు.
ఒకసారి సౌలు రాజు రెండు లక్షల సైన్యంతో వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేశాడు. వారిని ఓడించి, వారి రాజైన అగగును బందీగా పట్టుకొన్నాడు.
వారి పశువులను చంపకుండా క్రొవ్విన వాటిని తెచ్చుకొన్నాడు. ఈ పని చేయడం ద్వారా దేవుని ఆజ్ఞ
మీరాడు. యిలా ఎందుకు చేశావని సమూయేలు అడిగాడు. “యెహోవాకు బలి అర్పించడానికి పశువులను పట్టి తెచ్చాను" అని చెప్పాడు.
అప్పుడు సమూయేలు "బలులు అర్పించుట కంటె యెహోవా ఆజ్ఞ పాటించుట శ్రేష్ఠము. నీవు యెహోవా ఆజ్ఞ మీరావు. పాపము చేశావు. కనుక ఆయన నిన్ను
రాజుగా వుండనివ్వడు" అన్నాడు.
సౌలు రాజు దావీదును చంపుటకు ప్రయత్నించుట :
ఒకసారి ఫిలిప్తీయులు యూదా దేశంపైకి దండెత్తారు. వాళ్ళ సైన్యంలో గొల్యాతు అనే మహా వీరుడు, బలశాలి వున్నాడు. అతనిని ఎదిరించే ధైర్యం
ఇశ్రాయేలు వారిలో ఎవరికీ లేకపోయింది. చివరకు యెషయ కుమారుడైన దావీదు అను యువకుడు, వడిసెల రాయితో అతన్ని కొట్టి సంహరించాడు.
సౌలు రాజు చాల సంతోషించి, దావీదును సైన్యాధి కారిగా నియమించాడు. స్త్రీలు దావీదును ప్రశంసించారు. "సౌలు వేల కొలది, దావీదు పదివేల కొలది శతృవులను హతము చేశారు" అని పాటలు పాడారు. దావీదును ఎక్కువగా పొగడటం వినిన సౌలు అసూయ పడ్డాడు. దావీదు పట్ల అసూయతో కోపం
పెంచుకొన్నాడు. ఒక దురాత్మ సౌలును పీడిస్తూ వుండేది. దానిని పారద్రోలేందుకై దావీదును వీణ వాయించుటకై నియమించుకొన్నాడు. ఒకసారి సౌలు
దావీదుపై ఈటె విసిరాడు. కాని దావీదు తెలివిగా తప్పించుకొన్నాడు. సౌలు తన పెద్ద కుమార్తెను దావీదుకు భార్యగా చేస్తానని ప్రమాణం చేశాడు. కాని
మాట తప్పి రెండవ కుమార్తె మీకాలును యిచ్చాడు. సైన్యంలో ప్రజలలో దావీదుకు పెరుగుతున్న అభిమానం చూసి సౌలు భయపడసాగాడు. దావీదును ఎలాగైనా చంపాలని ప్రయత్నం చేయసాగారు. కాని సౌలు రాజు కుమారుడు,
దావీదు స్నేహితుడు అయిన యోనాతాను దావీదును దూర దేశానికి పంపించి
వేశాడు.
యుద్ధంలో సౌలు రాజు మరణించుట :
ఫిలిప్తీయుల సైన్యము ఇశ్రాయేలు దేశం మీదికి దండెత్తి వచ్చింది. దానిని ఎలా ఎదిరించాలో సౌలు రాజుకు అర్ధం కాలేదు. అతడు మారు వేషంలో సోదె చెప్పే ఒక స్త్రీ దగ్గరికి వెళ్లాడు. ఆమె చనిపోయిన సమూయేలు ఆత్మను రప్పించింది. సమూయేలు ఆత్మ సౌలుతో యిలా చెప్పింది. "యెహోవా నిన్ను ఎడబాసి, నీకు పగవాడు అయ్యాడు. నీవు దేవుని విసర్జించావు. నన్ను భవిష్యత్తును గురించి అడుగుట వలన ఏమీ లాభంలేదు. ఆయన నీ నుండి రాజ్యాధికారం
రేపటి యుద్ధంలో ఫిలిప్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు ఓడి పోవడం ఖాయం.
నీవు, నీ కుమారులు ఒకే రోజు మరణిస్తారు.
మరుసటి దినం యుద్ధంలో సౌలు రాజు యొక్క ముగ్గురు కుమారులు హతులయ్యారు. సౌలు రాజు తీవ్రంగా గాయపడ్డాడు. శతృవుల చేతిలో చనిపోవడం యిష్టంలేక, తన ఆయుధములు మోసే వానితో తనను చంపమని కోరాడు. వాడు రాజును చంపుటకు యిష్టపడలేదు. అందువల్ల సౌలు తన కత్తిమీద తానే పడి చనిపోయాడు.
ధ్యానాంశములు :
1.సౌలు రాజు ఇశ్రాయేలు ప్రజల మొదటి రాజు. దేవుని చేత అభిషేకింపబడినవాడు.
2. అసూయ, అవిధేయత వలన సౌలురాజు దేవుని దృష్టిలో చెడిపోయాడు. అందువల్ల రాజ్యాధికారం పోగొట్టుకొన్నాడు.
3. సౌలు రాజు జీవితము విశ్వాసులకు ఒక హెచ్చరిక. దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన పనులు చేయకూడదు అని మనం గుర్తుంచుకోవాలి.
సౌలు దావీదును చంపాలని రెండుసార్లు ప్రయత్నించాడు. కాని చంపలేకపోయాడు.
బంగారు వాక్యము :
"బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళ కొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము" 1 సమూయేలు 15:23
Good information
ReplyDeleteవాక్యము రాదు చెపాలాని ఆశ కలిగింది
ReplyDelete