నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.
కీర్తనలు 23: 6
ప్రియులారా దేవుడు మనకు మంచి కాపరియై యున్నాడు మన కాపరి మనకు ముందుగా నడుస్తాడు
ఏ అపాయము మనకు రాకుండా ఆయనే మనలను కాపాడుతాడు
దావీదు భక్తుడు ప్రతీ దినం దేవుని సన్నిధిలో ఉండుటకు ఇష్టపడేవాడు అందుకే దేవుని కృపా క్షేమములు ఆయన బ్రతుకు దినములన్నిటను
ఆయనకు తోడుగా వచ్చాయి
దేవుడు ఆయన సన్నిధిలో దీన మనసు గలవారుగా
ఉన్నవారిని ఆశీర్వదించి కాపాడుతాడు
ఆయనను ఆశ్రయించిన వారు గొప్ప మేలులను పొందుకుంటారు దేవుడు మాట ఇచ్చి దానిని నెరవేర్చువాడు.
మనము కూడా దేవుని సన్నిధిలో ప్రతీ దినం
దీనమనసు గలవారమై యున్నట్లైతే ఆయన కృప మనకు తోడుగా ఉంచి మన బ్రతుకుదినములన్నిటను
ఆయన క్షేమము గలవారమై యుంటాం ఈ వాక్యం దేవుని కృపా క్షేమముల కొరకు కనిపెట్టి
ఆయన సన్నిధిలో జీవించాలనే ఆశను మనలో కలుగజేస్తుంది గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని క్షేమము కలిగి జీవిద్దాం
దేవుని కృపాక్షేమములు దావీదుకు తోడుగా ఉన్నట్లుగ మనకు కూడా ఉండును గాక ఆమెన్
No comments:
Post a Comment