నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు.
కీర్తనలు 5: 11
ప్రియులారా దేవుని హృదయానుసారుడైన దావీదు భక్తుడు ఆయన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆనందిస్తూ ఈ వాక్యాన్ని రాసాడు
దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పటినుండి దేవునికి ఇష్టుడిగా ఉన్నాడు దావీదు తన జీవితంలో ఏ ప్రతికూల పరిస్థితి వచ్చిన దేవుని ఆశ్రయించేవాడు అప్పుడు దేవుడు దావీదుకు కలిగిన ఆపదలనుండి అతని రక్షించేవాడు తన గొఱ్ఱె పిల్లను సింహం నోటితో
పట్టుకొని వెళుతుండగా దావీదు దేవునికి ప్రార్ధించి ఏ ఆయుధము లేకనే ఆ సింహము నోటిని చీల్చి గొర్రె పిల్లను కాపాడాడు ఇలాంటి అనేక పరిస్థితులలో దావీదు దేవుణ్ణి ఆశ్రయించి గొప్ప సంతోషాన్ని పొందుకున్నాడు
ప్రియులారా మనము కూడా అటువంటి దేవుని కాపుదలలో ఉన్నట్లైతే ఆయన ఇచ్చు శాశ్వతమైన ఆనందాన్ని పొందుకోగలము ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకుంటామో అప్పుడే దేవుడిచ్చు సంతోషాన్ని పొందుకోగలము
మన జీవితంలో ప్రతి చిన్న విషయములోను దేవుని ఆశ్రయించువారమై యుండాలి. అప్పుడే ఆయన కాపుదల మనకు తోడుగా ఉంటుంది
ఈ వాక్యం మనము దేవుణ్ణి ఆశ్రయించి ఆయన కాపుదల పొందుకొని ఆయనిచ్చు సంతోషాన్ని పొందుకుందాం
దేవుడు నిత్యము తన కాపుదలలో మనలను ఉంచును గాక
No comments:
Post a Comment