Breaking

Thursday, 20 August 2020

Daily bible verse in telugu

 

నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. 

2కోరింథీయులకు 12: 9

ప్రియులారా దేవుని కోసం ఆయన పరిచర్య కోసం అత్యధికముగా శ్రమలు పొంది ఎంతో ప్రయాస పడిన పౌలు భక్తుడు ఈ మాటను మనకు తెలియజేస్తున్నాడు దేవుని కోసం ఇంతగా పరిగెత్తిన పౌలు గారికి కూడా శరీరములో ఒక బలహీనత ఉండేది ఆ బలహీనత తొలిగిపోవాలని అనేక సార్లు ఆయన దేవునికి మొఱ్ఱ పెట్టాడు కానీ దేవుడు ఆ బలహీనతను తీసివేయకుండా పౌలు గారికి ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు ఈ వాగ్దానాన్ని విశ్వసించిన పౌలు భక్తుడు అప్పటి నుండి తన శరీరములో ఉన్న బలహీనతను గురించి పట్టించు కోకుండా దేవుడు తనకిచ్చిన పని నిమిత్తం గురి యొద్దకే పరిగెత్తే వాడిగా మారాడు అలా దేవుడు తనకిచ్చిన పని పూర్తి చేసి నేను నా పని కడముట్టించితిని అని ధైర్యముగా చెప్పగలిగాడు  

ప్రియులారా మనము కూడా చాలా సార్లు మన శరీర అవసరతల కోసమో లేక శరీర బలహీనతల కోసమో 

ప్రార్ధిస్తూ మన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటాము 

కానీ మనం ఎలా ఉన్న మనకు ఏ అవసరతలు ఉన్న 

మనము వాటిని దేవునికి అప్పగించి దేవుడు మనకు అప్పగించిన పని మీదనే ద్రుష్టి నిలిపే వారమై యుండాలి మనకు ఎలాంటి బలహీనతలు ఉన్న 

అవి దేవుని కృపకే అప్పగించుకుని మన బలహీనతల 

యందు దేవుని శక్తిని చూచేవారమై యుండాలి 

ఈ వాక్యం మనకు దేవుని కృప చాలునని 

మన బలహీనతలలో ఆయన శక్తి మనకు తోడుగా 

ఉంటుందని తెలియజేస్తుంది 

గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ 

దేవుని బలమైన శక్తిని పొందుకుందాం 

దేవుని కృప పౌలుకు తోడుగా ఉన్నట్లు మనకును 

తోడై యుండును గాక ఆమెన్ 


No comments:

Post a Comment