మత్తయి 5: 3-5
ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.
మనము పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే
ఆత్మవిషయములో దీనులమవ్వాలి
ఆత్మవిషయములో దీనులైన వారు
దేవుని ఎదుట వారి గురించి చెప్పుకునేందుకు వారిలో ఎలాంటి నీతిన్యాయాలూ, ఎలాంటి యోగ్యతా లేవని గ్రహిస్తారు. అందువల్ల వారు దేవుని యెదుట వారిని వారు బహుగా తగ్గించుకుంటారు.
మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మన పాపాల కొరకు పశ్చాత్తాపడాలి
పశ్చాత్తాపపడేవారు ఎవరంటే తమ ఆధ్యాత్మిక స్థితిని గుర్తించినవారు. వారి పాపాల విషయములో పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పిస్తాడు కాబట్టీ,వారి ఆధ్యాత్మిక స్థితిని వారు గుర్తిస్తారు
తమ ఆధ్యాత్మిక స్థితిని గుర్తించినవారు, దీనులు, వినయమనస్కులు ధన్యులు అని యేసయ్య అంటున్నాడు
మత్తయి 5: 4
దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.
ఎవరైతే వారి ఆత్మీయ స్థితిని వారిలో ఉన్న పాప స్వభావాన్ని గుర్తిస్తారో అలాంటివారు బహుగా దుఃఖపడతారు.
అది ఇహలోక సంబంధమైన దుఃఖమో, లేక వారు కోరినది దొరకనందువల్ల వారికి కలిగే స్వార్థపూరితమైన దుఃఖమో కాదు గాని
వారు చేసిన పాపాల నిమిత్తం వారిలో కలిగిన పశ్చాత్తాపాన్ని బట్టి వచ్చిన దైవ చిత్తానుసారమైన
దుఃఖం. ఇది రక్షణను కలుగజేస్తుంది.
దేవుని రాజ్య ధన్యతకు ఇది దారి తీస్తుంది.
మత్తయి 5: 5
సాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
సాత్వికం అంటే బలహీనత కాదు. నిజానికి అది ఒక గొప్ప ఆత్మబలం. ఇది దేవుని కుమారుడైన యేసుప్రభువులో ఉన్న ఒక గొప్ప లక్షణము
యేసయ్య జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించడం ద్వారా సాత్వికం అంటే ఏంటో మనం అర్థం చేసుకోగలం. సాత్వికం అనేది సైతానుకూ, పాపానికీ వ్యతిరేకంగా సత్యం పక్షాన బహు బలంగా పోరాడే ఆధ్యాత్మిక యోధుడి వ్యక్తిత్వానికి అనుగుణమైన ఒక గొప్ప లక్షణం
దేవుడు మనల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నడిపించిన వాటిని వినయంతో అంగీకరిస్తూ దేవునికోసం శ్రమలను బాధలను అనుభవించడానికైనా సమ్మతించడం, హేళన, తిరస్కారం పాలైనా కోపం, ప్రతీకారం చూపకుండా ఉండడానికి సిద్ధపడడమే నిజమైన సాత్వికం
అన్ని విషయాలలో మనము దేవునికి లోబడుతూ
సంపూర్ణముగా ఆయన చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనలో ఈ గొప్ప లక్షణాన్ని పుట్టించి దానిని మనలో పెంపొందిస్తాడు.
No comments:
Post a Comment