యెహోవా సెలవిచ్చున దేమనగా నన్నాశ్రయించుడి, నన్నాశ్రయించినయెడల మీరు బ్రదుకుదురు.
ఆమోసు 5: 4
ప్రియులారా దేవుడే మనకు ఆశ్రయ దుర్గమై యున్నాడు ఆయనను ఆశ్రయించువారిని ఆయన ఎన్నడూ త్రోసివేయడు రాహబు అను వేశ్య దేవునికి గూర్చి విని అయనను ఆశ్రయించింది గనుకనే
తన ప్రాణమును తన కుటుంబం యొక్క ప్రాణాలను
కాపాడుకోగలిగింది అన్యులతో చనిపోవాల్సిన ఆమెను దేవుడు బ్రతికించి గొప్పగా ఆశీర్వదించాడు
ప్రియులారా పాపములో పడి నిత్య నరకములో ఉండాల్సిన మనలను కూడా దేవుడు తన రక్తము వలన కాపాడుకున్నాడు ఆయన రక్షణను మనము పొందుకోవాలంటే ఆయనను ఆశ్రయించి ఆయన మార్గములో నడవవలిసినవారమైయున్నాము మనము అప్పుడే మనము నిత్యజీవములో ప్రవేశించగలము ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేయకుండా నిత్య జీవంపై మన మనసును కేంద్రీకృతం చేద్దాం
ఈ వాక్యం మనలను నిత్యజీవానికి దగ్గరగా చేస్తుంది గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతీ అవసరతలోనూ మనము ఆయనను ఆశ్రయించి
మనము ఆయనను ఆశ్రయించి ఆయన మార్గములో నడుస్తూ దేవుడిచ్చు నిత్యరాజ్యన్ని స్వతంత్రించుకొందాం
దేవుడు ఈ వాక్యం మనలను గొప్పగా దీవించును గాక
No comments:
Post a Comment