Breaking

Friday, 14 August 2020

Bible story of joseph | ఐగుప్తు దేశంలో యోసేపు bible stories in telugu

 

యోసేపు పోతీఫరు యింటిలో సేవకునిగా, చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు. దేవుడు యోసేపుకు తోడై వున్నందున అతడు ప్రతి పనిలో వర్థిల్లి, మంచివాడనే పేరు సంపాదించుకొన్నాడు. యజమాని అయిన పోతిఫరు యోసేపును ఎక్కువగా ఆదరించి, ప్రేమించాడు. తన యింటి విషయాలన్నీ
అతనికి అప్పగించాడు. పోతిఫరు భార్య యోసేపు యొక్క సుందర రూపం చూసి అతన్ని మోహించింది. తనతో శయనించమని చాలా సార్లు బలవంత పెట్టింది. కాని యోసేపు సమ్మతించలేదు. “నా యజమానికి అన్యాయం చేయను. దేవునికి విరోధంగా పాపం చేయను" అని చెప్పాడు. అందుకు ఆమె మనస్సులో
యోసేపు పై కోపం పెట్టుకొంది. ఒకరోజు యోసేపు ఆమె గదిలోనికి వెళ్ళినప్పుడు తన కోరికను బయట పెట్టింది. యోసేపు తిరస్కరించి వెళ్లిపోయాడు. తన
వస్త్రాన్ని ఆమె గదిలోనే వదిలి పోయాడు. ఆమె భర్త రాగానే యోసేపు తనను అవమానించాడని చాడీలు చెప్పింది. పోతీఫరు ఆమె మాటలు నమ్మి యోసేపును
చెరసాలలో వేయించాడు. అయితే యోసేపు చెరసాలలో అందరితో మంచిగా వుండేవాడు. అతడు ఖైదీల యొక్కయు, చెరసాల అధికారి యొక్కయు ప్రేమాభిమానాలు సంపాదించాడు.

చెరసాలలో యోసేపు : కలల భావం చెప్పుట :

యోసేపు చెరసాలలో అందరికి అనుకూలంగా వుంటున్నాడు. ఫరో చక్రవర్తి యొక్క పానదాయకుడు (పానీయములు అందించేవాడు) భక్ష్యకారుడు
(రొట్టెలు, భోజనం అందించేవాడు) తప్పుచేసి చెరసాలలో వేయబడ్డారు. ఒక రాత్రి వాళ్ళిద్దరూ వేరు వేరు కలలుగన్నారు. ఉదయాన్నే విచారంగా వున్నారు.
వారు తాము కలలో చూసిన సంగతులను యిలా వివరించారు. పానదాయకుని కలలో మూడు ద్రాక్షావల్లులు కనిపించాయి. అవి చిగిరించి ద్రాక్ష పండ్లు కాశాయి. వాటి నుండి ధ్ర్యారసం తీసి అతడు ఫరోకు గిన్నెను అందిస్తున్నాడు. యోసేపు అతని కలకు భావం యిది అని చెప్పాడు. పరోనీకు మూడు రోజుల్లో మరల
ఉద్యోగం యిస్తాడు. నీవు యింతకు ముందు వలె రాజుకు ద్రాక్షారసం అందిస్తావు. అప్పుడు నీవు నన్ను జ్ఞాపకం వుంచుకో" మూడు రోజుల్లో అతడు-
తన వుద్యోగం తిరిగి పొందాడు భక్త్యకారుడు తన కలను గురించి యిలా చెప్పాడు. "నా తలపై
మూడు గంపలు పిండి వంటలతో నిండి వున్నాయి. పై గంపలో ఫరో కోసం వండిన మంచి వంటలున్నాయి. అయితే పక్షులు వాటిపై వాలి తినివేస్తున్నాయి
యోసేపు అతని కలకు అర్థం యిలా చెప్పాడు. -మూడు రోజుల్లో ఫరో నిన్ను మ్రానుమీద ప్రేలాడదీస్తాడు. మరణించిన తర్వాత పక్షులు నీపై వాలి నీ మాంసం తినివేస్తాయి" యోసేపు చెప్పిన విధంగానే అతనికి జరిగింది రెండు సం॥|లు గడిచిపోయాయి. ఫరో చక్రవర్తి రెండు కలలు గన్నాడు
మొదటి కలలో యేడు బలమైన ఆవులు, యేడు చిక్కిపోయిన వికారమైన ఆవులు కనిపించాయి. యేడు బక్కచిక్కన ఆవులు యేడు బలమైన ఆవులను తినివివేశాయి. రెండవ కలలో యేడు మంచి పుష్టిగల (ధాన్యపు) వెన్నులు పుట్టాయి మేడు పీల వెన్నులు మొలిచాయి. యేడు పీల వెన్నులు యేడు పుష్టిగల వెన్నులను తినివేశాయి. తెల్లవారింది. రాజు చాల విచార వదనంతో వున్నాడు. దేశంలోని పండితులను, శకున గాండ్రను పిలిపించాడు. తన కలలకు అర్థమేమిటో వివరించమని కోరాడు. కాని ఎవ్వరూ ఆయన కలలకు భావం చెప్పలేకపోయారు. అప్పుడు పానదాయకుడు, బందీ గృహంలో వున్న యోసేపు కలల భావం చక్కగా వివరిస్తాడని చెప్పాడు. ఫరో వెంటనే యోసేపును పిలిపించాడు. తాను చూసిన కలలను చెప్పి, వాటి భావం ఏమిటో వివరించమని
కోరాడు. అంతా వినిన తర్వాత యోసేపు ఫరోతో యిలా అన్నాడు. రాజా ! నేను నా తెలివితేటల వల్ల కాదు. దేవుడు నాకిచ్చిన జ్ఞానంతో మీ కలలకు
అర్ధం వివరిస్తాను. మీరు కనిన రెండు కలల భావం ఒక్కటే. దేవుడు ఈ పనిని త్వరగా జరిగించబోతున్నాడు. కనుకనే మీకు రెండు సార్లు తెలియచేయబడింది. మీ రాజ్యంలో రాబోయే ఏడు సం||లలో పంటలు బాగా పండుతాయి. ప్రజలు సుఖంగా వుంటారు. ఏడు బలిసిన ఆవులు, ఏడు పుష్టిగల వెన్నులు యిందుకు సూచనగా వున్నాయి. ఆ తర్వాత రాబోయే యేడు సం||లు మహా భయంకరమైన కరవు రాబోతున్నది. ప్రజలు తిండిలేక చాలా కష్టపడతారు. ఆకలి బాధతో చచ్చిపోతారు. బక్కచిక్కిన ఆవులు, పీల వెన్నులు అందుకు
సూచనగా వున్నాయి. ఆ సమయంలో ప్రజలు మహాశ్రమలు అనుభవిస్తారు.

రాజాస్థానంలో యోసేపు :

యోసేపు మాటలు వినిన ఫరో చక్రవర్తి మనసులో చాలా కలత చెందాడు. రాబోయే కరవు కాలంలో ప్రజలను ఎలా ఆదుకోవాలో వివరించమన్నాడు. అందుకు జవాబుగా యోసేపు “రాజా పంటలు బాగా పండిన యేడు సం||లు పంటలో అయిదవ వంతు ధాన్యం సేకరించాలి. దానిని పెద్ద పెద్ద పట్టణాలలోని ధాన్యాగారాల్లో నిల్వ చేయాలి. కరవు వచ్చిన సం||లలో ఆ ధాన్యం ప్రజలకు పంచాలి" అని సలహా యిచ్చాడు. యోసేపు యిచ్చిన సలహా చక్రవర్తికి, అధికారులకు బాగా నచ్చింది. "నీ వంటి తెలివితేటలు గలవాడు మా రాజ్యంలో ఎవరూ లేరు. నీవు నా యింటికి అధికారిగా వుండు. ఒక సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటె పైవాడను. నా ప్రజలందరు నీకు విధేయులై వుంటారు” అన్నాడు. ధాన్యం సేకరించి, దాచి వుంచే పనిని ఫరో యోసేపుకు అప్పగించాడు. యోసేపు చాలా నమ్మకంగా, తెలివిగా తనకు అప్పగించిన పనిని చేశాడు. ధాన్యపు కొట్ల నిండా ధాన్యం సేకరించి వుంచాడు. ఐగుప్తు దేశంలో చుట్టుప్రక్కల వున్న దేశాల్లో గొప్ప కరవు వ్యాపించింది.
ప్రజలు రాజు దగ్గరికి వెళ్ళి తమ బాధలు చెప్పుకొన్నారు. రాజు అందరిని యోసేపు దగ్గరకు పంపించాడు. యోసేపు ధాన్యపు కొట్లను తెరిపించి అందరికి ధాన్యం అమ్మించాడు. ఫరో యోసేపుకు "జపుత్సనేహు” అని పేరు పెట్టాడు. అతనికి యాజకుడైన పోతీఫరు కుమార్తె "అసెనతు"నిచ్చి పెండ్లి చేశాడు. యోసేపుకు మనశ్హే  ఎఫ్రాయిము అను కుమారులు కలిగారు.

యోసేపు అన్నలు ఐగుప్తుకు వచ్చుట :

ఐగుప్తు దేశంలో ధాన్యం దొరుకుతుందని యాకోబుకు తెలిసింది. అతడు తన పదిమంది కుమారులను ఐగుప్తుకు పంపాడు. చివరి వాడైన బెన్యామీనును మాత్రం తన వద్ద వుంచుకొన్నాడు. యోసేపు తన అన్నలను గుర్తుపట్టాడు. కాని వారితో కఠినంగా మాట్లాడాడు. వారు మిక్కిలి భయపడి -అయ్యా మేము వేగుల వారము కాదు అని విన్నవించుకొన్నారు. యోసేపు షిమ్యోనును తన దగ్గర బందీగా వుంచుకొని, “ఈసారి మీరు వచ్చునప్పుడు
మీ చివరి తమ్ముణ్ణి కూడ తీసుకొని రండి" అని చెప్పి పంపాడు, వాళ్లు యిచ్చిన డబ్బుమూటలువాళ్ల సంచులలోనే పెట్టించాడు. మద్యదారిలో వారు తమ
సంచులు విప్పి చూసుకొని భయపడ్డారు. తండ్రితో జరిగిన విషయమంతా చెప్పారు.
కొంతకాలం గడిచింది. మరల ఐగుప్తుకు వెళ్ళి ధాన్యం తెమ్మని యాకోబు కుమారులకు చెప్పాడు. బెన్యామీను లేకుండా మేము వెళ్ళము అని వాళ్ళు గట్టిగా చెప్పారు. యాకోబు ఎంతో బాధపడ్డాడు. కాని తర్వాత బెన్యామీనును కూడ వారి వెంట పంపాడు.

యోసేపు అన్నలను తన యింటికి పంపాడు. మంచి విందు భోజనం పెట్టించాడు. కోరినంత ధాన్యం యిచ్చి పంపాడు. అయితే బెన్యామీను సంచిలో తన వెండి గిన్నెను, అతడు యిచ్చిన డబ్బును పెట్టించాడు. వాళ్లు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక అధికారిని పంపించాడు. అతడు వెదకగా బెన్యామీను
సంచిలో వెండి గిన్నె దొరికింది. అన్నలు యోసేపు దగ్గరికి వచ్చి బ్రతిమిలాడసాగారు. బెన్యామీనును చూడక పోతే మా తండ్రి మరణిస్తాడని చెప్పారు.
అప్పుడు యోసేపు తనను తాను బడులు పరచుకొన్నాడు. మీరు నన్ను వలన అందరికి మేలే జరిగింది అన్నాడు. “ఈసారి వస్తే మన అమ్మివేయడం అన్నాడు. ఫరో కూడ యోసేపు అన్నలు ఐగుప్తుకు వచ్చారని తెలిసి చాలా సంతోషించాడు

యాకోబు కుటుంబము ఐగుప్తుకు వెళ్ళుట :

యోసేపు అన్నలు తమ తండ్రి అయిన యాకోబుతో జరిగిన సంగతులన్నీ చెప్పారు. యోసేపు ఐగుప్తు దేశంలో చక్రవర్తి వలె సమస్త వైభవంతో, అధికారంలో వున్నాడని చెప్పారు. ఈ సంగతి వినిన యాకోబు
చాల సంతోషించాడు. చనిపోయే ముందు తన కుమారుణ్ణి చూడాలన్న ఆశతో ఐగుప్తు దేశం వెళ్లడానికి యిష్టపడ్డాడు. యాకోబు కుమారులు, కోడళ్ళు,
మనుమలు, మనుమరాండ్రు మొత్తం 66 మంది ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తు దేశంలోని సారవంతమైన భూమి వారికి ఇవ్వబడింది. యోసేపు భార్య, యిద్దరు
పిల్లలతో కలిపి మొత్తం 70 మంది ఐగుప్తులో నివసించారు. వారు 430 సం||లు ఐగుప్తులో వున్నారు. బహుగా విస్తరించారు. బహుగా ఆశీర్వదింపబడ్డారు. వారి సంఖ్య ఆరు లక్షలకు పెరిగింది. యాకోబు 147 సం||లు బ్రతికాడు. అతని కోరిక ప్రకారం అతని దేహాన్ని కనాను దేశంలోని పితరుల సమాధుల వద్ద సమాధి చేశారు. యోసేపు
110 సం||లు బ్రతికాడు. “దేవుడు దయ చూపి, ఏనాడైనా మీరు కనాను దేశం తిరిగి వెళ్ళితే, నా యెముకలు మీ వెంట తీసికొని వెళ్ళండి" అని కోరాడు.
అన్నలు అతని మృత శరీరాన్ని సుగంధ ద్రవ్యాలు పూసిన ఒక పెట్టెలో భద్రపరచారు.యోసేపు ఉత్తమ గుణ సంపన్నుడు. నమ్మకమైన వాడు. దేవుని
యందు భయభక్తులు గల వాడు. దేవుని ఆత్మగలవాడు. నీతిగా జీవించినవాడు. దేవుడు యోసేపును బహుగా ఆశీర్వదించాడు.

ధ్యానాంశములు:

1. యోసేపు తండ్రికి విధేయుడుగా వున్నాడు. అన్నలను ప్రేమించి, కష్టకాలంలో వారిని ఆదుకొన్నాడు.

2. యోసేపు చెడ్డపని చేయడానికి యిష్టపడలేదు. పోతీఫరు భార్య కోరికను అతిరస్కరించాడు.

3. దేవుడిచ్చిన జ్ఞానంతో ఐగుప్తు రాజుకు, ప్రజలకు, అన్నలకు మేలు చేసి మంచి పేరు తెచ్చుకొన్నాడు.

4. యోసేపు నమ్మకంగా పని చేశాడు.

బంగారు వాక్యము :

యోసేపు ఫలించెడి కొమ్మ, ఊటయెద్ద ఫలించెడి కొమ్మ. దాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును. (ఆది. 49:22)

No comments:

Post a Comment