Breaking

Sunday, 26 July 2020

Bible story of samuel | సమూయేలు | bible stories in telugu | telugu bible stories



ఇశ్రాయేలు దేశంలోని ఎఫ్రాయీము ప్రాంతంలో రామతయిమ్సోఫీము (రామా) అను పేరుగల ఒక పట్టణం వుంది. ఆ పట్టణంలో ఎల్కానా అను మనుష్యుడు ఉండేవాడు. అతనికి యిద్దరు భార్యలు వున్నారు. వారి పేర్లు హన్నా, పెనిన్నా, హన్నాను భర్త చాల ప్రేమగా చూసేవాడు. అయితే ఆమెకు
పిల్లలు లేరు. అందువల్ల పెనిన్నా ఆమెను చులకనభావంతో చూసేది. హన్నా మనసులో చాల బాధపడుతుండేది. ఆమె షిలోహులోని దేవుని మందిరానికి వెళ్ళి ఈ విధంగా ప్రార్థించింది. "యెహోవా దేవా! నాయందు దయవుంచి, నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తే వాడిని నీకు యాజకునిగా చేస్తాను".
హన్నా తనలో తాను మాట్లాడుకోవటం యాజకుడైన ఏలీ విన్నాడు. ఆమె మత్తురాలై అర్ధంలేని మాటలు పలుకుతోంది అని తలంచాడు. కాని ఆమెనుండి
నిజం తెలిసికొని, ఆమెను దీవించి పంపాడు.

దేవాలయంలో సమూయేలు :
హన్నాకు ఒక కుమారుడు పుట్టాడు. ఆమె ఆ బాలునికి సమూయేలు అని పేరు పెట్టింది. బాలుడు తల్లిదగ్గర పాలు త్రాగడం మానగానే హన్నా వాడిని షిలోహులోని దేవుని మందిరానికి తీసికొని వెళ్ళింది. “యెహోవా నా మనవి ఆలకించాడు. నాకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. కాబట్టి నేను ఈ బాలుణ్ణి
యెహోవాకే ప్రతిష్ఠిస్తున్నాను" అని మ్రొక్కింది. ఆ బాలుణ్ణి యాజకుడైన ఏలీ దగ్గర వదిలి వెళ్ళిపోయింది. బాలుడైన సమూయేలు దేవునికి, మనుష్యులకు అనుకూలంగా జీవింపసాగాడు.
ఏలీకి హోప్పీ, ఫినెహాసు అను యిద్దరు కుమారులు వున్నారు. వారు యాజక ధర్మం విస్మరించి దేవునికి అర్పించే మాంసములో మంచి దానిని ముందే తీసికోసాగారు. అంతేకాక మందిరంలో సేవచేసే స్త్రీలతో వ్యభిచారం చేయసాగారు. కనుక వారిపై యెహోవా దేవునికి చాల కోపం వచ్చింది. ఆయన
ఒక దైవజనుని ద్వారా ఈ హెచ్చరిక చేశాడు. "నీ కుమారులిద్దరు ఒకే రోజు మరణిస్తారు. నీ తరువాత ఒక విశ్వాసపాత్రుడైన యాజకుడు
నియమించబడతాడు." ఒక రాత్రి సమూయేలు పండుకొని వున్నాడు. అప్పుడు దేవుడు
సమూయేలూ, సమూయేలు అని రెండుసార్లు పిలిచాడు. సమూయేలు ఏలీ తనను పిలిచాడనుకొన్నాడు. కానీ ఏలీ - "నేను నిన్ను పిలువలేదు. దేవుడే పిలిచి వుంటాడు. ఆయన నీతో చెప్పే మాటలు విని, రేపు ఉదయం నాతో చెప్పు" అన్నాడు. దేవుడు సమూయేలును పిలిచి మాట్లాడాడు. తాను ఏలీ కుమారులను నాశనం చేయబోతున్నానని, వారి యింటికి నిత్యమైన శిక్షను
విధించబోతున్నానని చెప్పాడు. సమూయేలు దేవుడు చెప్పిన మాటలు ఏలీకి చెప్పాడు. సమూయేలు పెద్దవాడైన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా
చాల ప్రసిద్ధి పొందాడు. యెహోవా ఆయనకు తోడుగా వున్నందున ఆయన పలికిన మాటలన్నీ నెరవేరుతుండేవి.

హోఫీ, ఫినెహాసులు మరణించుట :
ఫిలిపీయులు ఇశ్రాయేలీయులను ఓడించి, యెహోవా మందసాన్ని ఎత్తుకొనిపోయారు. మందసాన్ని అంటిపెట్టుకొని వున్న హోఫ్నీ, ఫినెహాసులు చంపబడ్డారు. కుమారులు సంహరింపబడినారన్న వార్త వినిన ఏలీ వెనుకకు పడి, మెడ విరిగి చనిపోయాడు. చనిపోయినపుడు ఆయన వయస్సు 90 సంవత్సరములు.
ఫిలిప్తీయులు యెహోవా దేవుని మందసాన్ని అష్టాదులో వున్న తమ దేవతయైన “దాగోను” గుడిలో వుంచారు. మరుసటి రోజు ఉదయం దాగోను దేవత బోర్లాపడి వుండటం చూశారు. రెండవ రోజు కూడా దేవత మందసం ఎదుట క్రిందపడి వుంది. దాని తల, రెండు అరచేతులు కొంచెం దూరంలో పడి వున్నాయి. మొండెము మాత్రం మిగిలి వుంది. ఆ దేశంలో ప్రజలు గడ్డల రోగంతో చచ్చిపోతున్నారు వాళ్లు యెహోవాకు భయపడి, ఆయనమందసాన్ని గాతుకు పంపించారు. గాతు వారు ఎ.నుకు, ఎక్రోను వారు ఇశ్రాయేలు
రాజ్యంలోని బెల్లెహేముకు పంపించారు. మందసము వెంట 5 బంగారు గడ్డలను 5 బంగారు చుంచులను (పంది కొక్కులను) అపరాధార్ధ అర్పణగా పంపించారు.
ఇశ్రాయేలీయులు మందసాన్ని గిబియాలోవుంచారు. సమూయేలు ప్రజలకు బయలు దేవతలను, అపారోతు దేవతలను తీసి పారవేయండి.
యెహోవానే సేవించండి" అని బోధించాడు. ప్రజలందరు ఆయన బోధను అనుసరించారు. సమూయేలు బేతేలు, గిల్గాలు, యిస్సా, రామా అను చోట్లలో వుంటూ, ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీరుస్తూ వుండేవాడు.

సమూయేలు సౌలును రాజుగా అభిషేకించుట :
సమూయేలు వృద్ధుడైపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆయనతో “మమ్ములను పరిపాలించడానికి ఒక రాజును ఎన్నిక చేయ"మని విన్నవించారు.
అందుకు ఆయన “రాజులు మీ సంతానాన్ని సేవకులుగా, రౌతులుగా, సైనికులుగా, రైతులుగా ఉపయోగించుకొంటారు. ఎక్కువ పని చేయిస్తారు.
మీ కుమార్తెలను దాసీలుగా చేసికొంటారు. మీ పంటలో పదియవ భాగం పన్ను రూపంలో తీసికొంటారు. కనుక మీకు రాజు అవసరం లేదు" అని వివరించాడు.
అయినా ప్రజలు ఆయన మాట వినలేదు. కాబట్టి సమూయేలు యెహోవా సెలవిచ్చిన విధంగా కీషు కుమారుడైన సౌలును రాజుగా అభిషేకించాడు.
సమూయేలు ఇశ్రాయేలు ప్రజల చివరి న్యాయాధిపతి, సౌలు మొదటి రాజు

సమూయేలు దావీదును రాజుగా అభిషేకించుట :
సౌలు రాజు సమూయేలుకు బదులుగా తానే దేవునికి దహనబలి అర్పించాడు. అమాలేకీయులతో యుద్ధం చేసి, బలిష్టమైన పశువులను వెంట తెచ్చుకొన్నాడు. (బక్కచిక్కన పశువులను చంపాడు) ఈ రెండు విషయాలలో దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. సమూయేలు సౌలు రాజు దగ్గరికి వెళ్ళి “నీవు
దహన బలి కొరకు ఈ పశువులను తెచ్చానని అబద్ధం చెప్పావు. నీవు దేవుని ఆజ్ఞను అతిక్రమించావు. కాబట్టి దేవుడు నీ రాజ్యాన్ని వేరొకరికి యిచ్చి వేస్తాడు"
అని ప్రకటించాడు. సమూయేలు బెల్లెహేము గ్రామానికి వెళ్లి యెమయి కుమారులో చిన్నవాడైన దావీదును రాజుగా అభిషేకించాడు. సమూయేలు
మరణించిన తర్వాత ప్రజలు అతని మృత శరీరాన్ని రామా పట్టణంలో పాతిపెట్టారు.

ధ్యానాంశములు:
1 సమూయేలు పెద్ద ప్రవక్త చాల భక్తిపరుడు. దేవుని శక్తితో నిండి వున్నవాడు. న్యాయాధిపతులలో చివరివాడు.
2.సమూయేలు బాల్యము నుండి దేవునికి విధేయుడైవున్నాడు.
3.సమూయేలు సౌలును దావీదును ఇశ్రాయేలు ప్రజలకు రాజులుగా అభిషేకించాడు. దావీదు మహారాజు వంశములోనే యేసుక్రీస్తు జన్మించాడు.
4.సమూయేలుతో దేవుడు మాట్లాడాడు.

బంగారు వాక్యము:
బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. 1 సమూయేలు 2:26.





No comments:

Post a Comment