యెహోవాయందు భయభక్తులుగలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును.
కీర్తనలు 25: 12
ప్రియులారా దావీదు భక్తుడు దేవుని యందు భయభక్తులు గల వాడు అందువలననే ఇశ్రాయేలీయుల రాజులందరిలో ఘనుడిగా ఎంచబడెను దావీదు భక్తుడు ఏ పని చేసిన ముందుగా దేవుని దగ్గర ప్రార్థించేవాడు అందుకే గొప్ప గొప్ప విజయాలను పొందుకున్నాడు మనం కూడా నెమ్మదిగా నా జీవితాన్ని పొందాలంటే ఆయనయందు భయభక్తులు గల వారమై ఉండాలి అప్పుడే మనం నడవవలసిన త్రోవను దేవుడు మనకు తెలియజేస్తాడు
అప్పుడు ఎటువంటి అపాయం రాకుండా నెమ్మది గలవారమై జీవిస్తాము
ఈ వాక్యము మనము తొట్రిల్లకుండా ఉండాలంటే
దేవుని యందు భయభక్తులు గలవారమై యుండాలని మనకు తెలియజేస్తుంది
గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ జీవితాంతం నెమ్మది గలవారమై బ్రతుకుదాం
దేవుడు ఈ వాక్యం ద్వారా మన జీవితాలను ఆశీర్వదించును గాక
No comments:
Post a Comment