నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును.
యిర్మియా 33: 3
ప్రియులారా దేవుడే జ్ఞానమునకు మూలాధారమైన వాడు ఆయనకు మరుగై నది ఏదియు లేదు
ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు
నెబుకద్నెజరు కనిన కలను కల భావమును చెప్పలేని
జ్ఞానులందరిని చంపవలెనని ఆజ్ఞ వచ్చినప్పుడు
దానియేలు భక్తుడు దేవుని సన్నిధిలో మొఱ్ఱపెట్టగా
దేవుడు ఆ కళను దాని భావమును ఆ కలర్ రావడానికి కారణామును కూడా దానియేలుకు బయలు పరిచాడు ఏ మనుష్యునికి ఇలాంటి జ్ఞానము ఉండలేదు కానీ దేవునికి ప్రార్థించడం ద్వారానే ఆ మరుగైన గూఢమైన సంగతులను దేవుడు దానియేలునకు తెలియజేశాడు
ప్రియులారా మనం కూడా ఆయన సన్నిధిలో మొఱ్ఱ పెట్టే వారముగా ఉన్నప్పుడు దేవుడు మనకు గొప్ప సంగతులను బోధిస్తాడు
నిజానికి దేవుడే మనతో మాట్లాడాలని ఆశ గలవాడై
యున్నాడు మనలను సృష్టించుకుంది తనతో మనం యుగయుగాలు ఉండాలనే
ఈ వాక్యం మనము దేవునికి ప్రార్ధించు వారమై ఉండి
గొప్ప గొప్ప సంగతులను తెలుసుకోవాలని గుర్తుచేస్తుంది ఎవరు గ్రహించని గూఢమైన వాటిని తెలుసుకొనుట కు దేవునికి ప్రార్థించాలని నేర్పిస్తుంది
కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో గడుపుతూ దేవునికి అతి సమీపముగా ఉండి ఆయన చెప్పే గొప్ప సంగతులను తెలుసుకొని జ్ఞానవంతులుగా అవుదాం
No comments:
Post a Comment