ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదు ఆయన నోటిమాటలను నా స్వాభిప్రాయముకంటె ఎక్కువగా ఎంచితిని.
యోబు 23: 12
ప్రియులారా యోబు భక్తుడు దేవుని దృష్టికి నీతిమంతుడు. ఆయన చెడుతనమును విసర్జించినవాడు. తనకు కలిగిన కష్టాలలో బాధలలో ఉండి కూడా ఆయన మాటకు ఎంతగా విలువనిచ్చాడో
మనకు ఈ వాక్యం ద్వారా వివరిస్తున్నాడు దేవుని ఆజ్ఞలను దేవుని నోట నుండి వచ్చిన ప్రతీ మాటను
తన స్వాభిప్రాయము కంటే ఎక్కువగా చూసాడు
తన చిత్తానుసారముగా కాకుండా దేవుని చిత్తానుసారముగా జీవించుటకు ఇష్టపడ్డాడు
అందుకే కష్టాలలో కూడా దేవునికి విలువనిచ్చి
దేవుని ఆశీర్వాదాలు రెండంతలుగా పొందుకున్నాడు
బైబిల్ లో చాలా మంది దేవుని మాట చొప్పున కాక తమ ఇష్టానుసారంగా జీవించడం వలన నశించిపోయారు. మనము వారిల కాకుండా యోబులా ఉన్నట్లయితే గొప్ప మేలులను పొందుకుంటాము ఈ వాక్యం మన సొంత ఆలోచనలు ద్వారా ఏ పనిని చేయకుండా ఆయన చిత్తానుసారముగా చేయాలని మనకు తెలియజేస్తుంది
మన హృదయ ఆలోచనలు బాల్యము నుండే చెడ్డవని
దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ మనం చేసే ప్రతీ పనిని ఆయన మాట చొప్పున చేసే వారమై యుందాం
దేవుడు మనలను ఈ వాక్యం ద్వారా నీతిమంతులనుగా చేయును గాక
No comments:
Post a Comment