Breaking

Tuesday, 2 June 2020

Daily bible verse in telugu 02.06.2020

Daily bible verse
నా పాదములు ఆయన అడుగుజాడలు విడువకనడచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నను సరించితిని.
యోబు 23: 11
ప్రియులారా యోగ భక్తుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఆయన చెడుతనము విసర్జించినవాడు తనకు కలిగిన కష్టాలలో బాధలో ఉండి కూడా దేవుని మాటకు ఆయన ఎంతగా విలువనిచ్చాడో మనకు ఈ వాక్యము ద్వారా వివరిస్తున్నాడు. దేవుని ఆజ్ఞలను దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాటను తన స్వాబిప్రాయం కంటే ఎక్కువగా చూసాడు తన చిత్తానుసారముగా కాకుండా దేవుని చిత్తానుసారముగా జీవించుటకు ఇష్టపడ్డాడు అందుకే కష్టాల్లో కూడా దేవునికి విలువనిచ్చి దేవుని ఆశీర్వాదాలు రెండంతలు గా పొందుకున్నాడు బైబిల్ లో చాలామంది దేవుని మాట చొప్పున కాక తమ ఇష్టానుసారంగా జీవించడం వలన నశించి పోయారు మనం వారిలా కాకుండా యోబుల ఉన్నట్లయితే గొప్ప మేలులను పొందు కుంటాము ఈ వాక్యము మనం మన సొంత ఆలోచన ద్వారా ఏ పని చేయకుండా ఆయన చిత్తానుసారముగా చేయాలని మనకు తెలియజేస్తుంది. మన హృదయాలలోచనలు బాల్యం నుండి చెడ్డవని దేవుని వాక్యం సెలవిస్తోంది గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ మనం చేసే పని ఆయన మాట చొప్పున చేసెవారమై ఉందాం.
దేవుడు మనలను ఈ వాక్యం ద్వారా నీతిమంతులనుగా చేయును గాక ఆమెన్


No comments:

Post a Comment