నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామ మును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.
ఆదికాండము 12: 2
ప్రియులారా ఈ వాగ్దానాన్ని దేవుడు అబ్రహాము నకిస్తున్నాడు అబ్రహాము అన్యుల దేశంలో నివసిస్తుండగా దేవుడు అబ్రహాము ను పిలిచి నీవు ఈ దేశమును విడిచి నేను చెప్పు దేశమునకు వెళ్ళినట్లయితే నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను నీవు అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పాడు ఈ వాగ్దానాన్ని నమ్మిన అబ్రాహాము తన దేశమును తన బంధువులను విడిచి దేవుడు చెప్పిన దేశమునకు వెళ్లి అత్యధికముగా ఆశీర్వదించబడ్డాడు
ఆయన సంతానములోనే యేసయ్య జన్మించి మన అందరి పాపముల కోసం మరణించి మనకు ఆ నరకం నుండి రక్షణను ఇచ్చి నిత్యజీవానికి మనలను వారసులనుగా చేసాడు. అబ్రాహాము దేవుణ్ణి ఎంతగానో విశ్వసించాడు గనుకనే దేవుడు నేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పుకొనుటకు సంతోష పడ్డాడు
ప్రియులారా దేవుడు అబ్రాహామునకే కాదు మనకును దేవుడైయున్నాడు మనం కూడా ఆయన చెప్పినట్టుగా
జీవించినట్లైతే అబ్రాహామును ఆశీర్వదించినట్లుగానే
మనలను కూడా ఆశీర్వదిస్తాడు మనము ఇతరులకు
ఆశీర్వాదకరంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు
ఎప్పుడైతే మనం ఈ లోకాశాలను శరీరాశలను
విసర్జించగలుగుతామో అప్పుడే దేవుని వాక్యానికి మనము చోటివ్వగలం
ఈ వాక్యం మనకు దేవుని మాట మీద విశ్వాసం ఉంచి
ఆశీర్వాదాలను పొందుకోవాలని మనం ఇతరులకు
ఆశీర్వాదకరంగా ఉండాలని తెలియజేస్తుంది
గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ అబ్రాహాములా మనం కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవిద్దాం
దేవుడు ఈ వాక్యం ద్వారా మనలను మన కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక ఆమేన్
No comments:
Post a Comment