సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు.
కీర్తనలు 34: 10
ప్రియులారా
అడవికి రాజు సింహము ఆ సింహము వేటాడి తన పిల్లలకు ఆహారాన్ని సమకూర్చుతుంది అటువంటి సింహపు పిల్లలు
అయినా ఆహారము దొరకక ఆకలిగల వై ఉండు నేమో గాని పరలోకమందు మహారాజుగా ఉన్న దేవుని ఆశ్రయించిన వారికి ఏదీ కూడా కొదువయై ఉండదని భక్తుడు సెలవిస్తున్నాడు
ఏలియా కరువు కాలంలో అరణ్యంలో ఉండగా దేవుడు ప్రతి దినం అతనికి కాకుల ద్వారా ఆహారాన్ని అందించాడు విధవరాలు కూడా దేవుని సేవకునికి ఆశ్రయమిచ్చి కరువు లో తన తోట్టి లోని పిండి ద్వారా
బ్రతికింపబడింది
ప్రియులారా మనం దేవుని ఆశ్రయించినట్లయితే మనకు కూడా ఏ కొదువా ఉండదు ఆయనను ఆశ్రయించడం అంటే ఆయనల మనం బ్రతకడమే
ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన సన్నిధికి దగ్గరగా ఉండాలనుకునే మనం కూడా పరిశుద్ధులముగా ఉండాలి మన పరిస్థితి ఏదైనా సరే నేను పరిశుద్ధునిగా నీ సన్నిధిలో ఉంటానని ఆయనను ఆశ్రయించి నట్లయితే ఆయనే మనలను ఆశీర్వదించి ఏ కొదవ లేకుండా మనలను కాపాడతాడు
ఈ వాక్యం మనము దేవుని ఆశ్రయించేవారిలా ఉండాలని అప్పుడే ఏ కొదవ లేకుండా మనం ఉండగలమని మనకు తెలియ జేస్తుంది కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనను ఆశ్రయించు వారమై ఉందాం
దేవుడు మనకు ఏది యు కొదవ లేకుండా ఆశీర్వదించును గాక
No comments:
Post a Comment