అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు.
సామెతలు 8: 34
ప్రియులారా
ఈ వాక్యాన్ని జ్ఞానవంతుడైన సొలోమోను ద్వారా
దేవుడు మన కొరకు రాయించాడు మనం ఆయన సన్నిధి లో అనుదినము ఉండి ఆయన మాటల కోసం ఎదురుచూడాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు
అందుకే ప్రతిదినం మనతో ఆయన మాట్లాడాలని
ప్రతీదినం ఆయన సన్నిధిలో మనం గడపాలని
ఆయన ఆశపడుతున్నారు
ఈ లోకములో మనలను మిక్కిలిగా ప్రేమించేది
దేవుడు మాత్రమే అని ఆయన ప్రేమ కొరకు కనిపెట్టువారమై యుందాం
ఈ వాక్యం మనలను దేవుని కొరకు కనిపెట్టు వారిని గాను ప్రతీ దినం ఆయన తో గడిపి ఆయన మాటలను
వినాలనే ఆశను కలుగజేస్తుంది గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని దగ్గరగా జీవిద్దాం
దేవుడు మనకు తోడుగా ఉంది మనలను దీవించును గాక ఆమెన్
No comments:
Post a Comment