యేసయ్య ఈ లోకంలో శరీరధారిగా వున్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్నో బోధలు చేశాడు. అప్పుడప్పుడు అక్రమము చేసే వారిని గద్దించాడు. దీనులపై దయ చూపించాడు. రోగులను స్వస్థపరచాడు. పాపులను క్షమించాడు. ఆయన పరలోకాన్ని గురించి, రెండవ రాకడను గురించి చెప్పిన బోధలు, ఉపమానాలు ఎంతో అర్థవంతమైనవి. మనుషులందరు బాగా ఆలోచించవలసినవి. "ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు" అని యేసు చెప్పిన మాటల్లో సంపూర్ణ సత్యం దాగి వుంది. రెండవ రాకడ నోవహు దినములలో జల ప్రళయం వచ్చినట్లు అకస్మాత్తుగా వస్తుంది. ఆ ఘడియను గురించి ఎవరికీ తెలియదు. దొంగ ఏ జామున వస్తాడో మనకు తెలియదు. అలాగే మనుష్య కుమారుడు ఎప్పుడు వస్తాడో ఎవరూ ముందుగా చెప్పలేదు. అయితే మెళకువగా వుండటం మన కర్తవ్యము.
యేసయ్య పరలోక రాజ్యమును గురించి, తన రెండవ రాకడను గురించి చెప్పిన ఈ ఉపమానము చాల ముఖ్యమైనది. పరలోక రాజ్యము తమ దివిటీలు
పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరిన పదిమంది కన్యకలను పోలివుంది. ఆ పదిమందిలో అయిదుగురు బుద్దిగలవారు. వారు
తమ దివిటీలకు అవసరమైన సిద్దెలను, వాటిలో చాలినంత నూనెను తీసికొని వెళ్లారు. తక్కిన అయిదుగురు బుద్దిలేని కన్యకలు, వారు దివిటీలు
వెలిగించడానికి అవసరమైనంత నూనెను వెంట తీసుకొని పోలేదు. అందరూ ఊరి బయట పెండ్లికుమారుడు, అతని బంధువుల రాక
కోసం వేచి యున్నారు. చాల పొద్దుపోయింది. అయినా పెండ్లికుమారుడు రాలేదు. కాబట్టి కన్యకలందరూ కునికిపాట్లుపడి, చివరకు గాఢంగా
నిద్రపోయారు అర్ధరాత్రి అయింది. “పెండ్లి కుమారుడు వస్తున్నాడు. అతన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కండి" -అనే కేక వినబడింది.10 మంది కన్యకలు నిద్ర మేల్కొన్నారు. తమ దివిటీలను వెలిగిస్తున్నారు. వారిలో అయిదు మంది కన్యకల దివిటీలు వెలగడం లేదు. సిద్దెలలో వున్న నూనెను పోయాలని
ప్రయత్నించారు. కాని సిద్దెలలో నూనె అయిపోయింది. ఈ సంగతి వాళ్ళు ముందు చూసుకోలేదు. మా దివిటీలు ఆరిపోతున్నాయి. మీ నూనెలో కొంచెము మాకు యివ్వండి అని మిగతా అయిదుగురు కన్యకలను బ్రతిమిలాడుతున్నారు. అందుకు వారు "మీకు నూనె యిస్తే మాకు చాలదేమో! కాబట్టి మీరు పరుగున గ్రామానికి వెళ్ళి నూనె అమ్మేవాళ్ళ దగ్గర కొనుక్కోని రండి. వెంటనే వెళ్ళి త్వరగా రండి అని చెప్పారు. ఆ అయిదుగురు బుద్ధిలేని కన్యకలు పరుగున వెళ్లారు. వాళ్ళు నూనె కోసం వెళ్ళగానే పెండ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధపడి వున్న కన్యకలు అతనికి స్వాగతం పలికారు. అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయారు. అంతట విందుశాల యొక్క తలుపు మూయబడింది. తర్వాత అయిదుగురు బుద్దిలేని కన్యకలు పరుగు పరుగున వచ్చారు. పెండ్లికుమారుడు వెళ్ళిపోయాడనీ,
అతనితోపాటు తమతో కలిసివచ్చిన అయిదుగురు (బుద్ధిగల) కన్యకలు పెండి విందులో పాల్గొనడానికి వెళ్ళారని తెలుసుకొని చాల నిరాశపడ్డారు. దు:ఖపడారు తమ తెలివి తక్కువ తనానికి చింతించారు. అయినా ఆశతో తలుపురం
వెళ్ళి పిలుస్తున్నారు. "అయ్యా! పెండ్లి కుమారుడా! మేము కూడ నీ పెండ్లి విందుకు వచ్చిన వాళ్ళమే. నూనెకోసం గ్రామానికి వెళ్ళాము. అందువల్ల కొంచెం ఆలస్యం అయింది. దయచేసి తలుపు తీయండి" అప్పుడు పెండ్లి కుమారుడు తలుపు అవతలివైపు నుండి సమాధానం యిచ్చాడు. “మిమ్మల్ని నేను ఎరుగను, నా కోసం నాకు స్వాగతం చెప్పడం కోసం వచ్చిన వాళ్ళు నా కోసం సిద్ధంగా వున్నారు, నన్ను ఎదుర్కొన్నారు. నా వెంట విందుశాలకు వచ్చారు కనుక మీరు వెనక్కు వెళ్ళిపొండి” అన్నాడు. ఈ ఉపమానము చెప్పిన తర్వాత యేసు శిష్యులతో యిలా అన్నాడు. (ప్రభువు రెండవసారి వచ్చు) ఆ దినమైనను, గడియయైనను మీకు తెలియదు,
గనుక మెళకువగా వుండుడి.

ధ్యానాంశములు :
1. ఈ ఉపమానము ద్వారా పరలోక రాజ్యమును గురించిన మర్మములు వివరించబడినవి. క్రీస్తు రెండవ రాకడ విషయంలో నిర్లక్ష్యముగా ఉండకూడదని హెచ్చరింపబడుచున్నాము. ..
2. మనము అనుకొనని ఘడియలో ఆయన వస్తాడు.
3. మనము శరీర రీతిగా కాక ఆత్మీయరీతిగా సిద్ధపడవలెనని హెచ్చరింపబడుచున్నాము. నూనె పరిశుద్ధాత్మ శక్తికి, భక్తి శ్రద్ధలకు సూచనగా వుంది. అవి
యితరులకు అప్పుగా యిచ్చేవి కావు. ఇతరులనుండి అప్పుగా తీసు కొనేవికావు.

4. బాగా సిద్ధపడిన వారిని బుద్దిగల కన్యకలని, సిద్ధపడని వారిని బుద్దిలేని కన్యలని యేసు ప్రభువే చెప్పాడు.
5. సమయము మించిపోయిన తర్వాత మనము దేవుణ్ణి ఎంత వేడుకొన్నా ఫలితం వుండదు. ధనవంతుడు లాజరు కథలో ధనవంతుడు తండ్రియైన అబ్రహామును బ్రతిమిలాడాడు. కాని ఫలితం పొందలేకపోయాడు.
బంగారు వాక్యము :
కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెళకువగా వుండుడి.
మత్తయి 24:42.
మత్తయి 24:42.
No comments:
Post a Comment