Breaking

Saturday, 11 January 2020

Daily bible verse in telugu


ఆదికాండము 17: 1
నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము.

ప్రియులారా ఈ వాగ్ధానాన్ని దేవుడు అబ్రాహామునకు ఇచ్చాడు ఆయన సర్వశక్తి గల దేవుడనని ఆయనే
సాక్షమిచ్చుచున్నాడు
దీనిని హీబ్రు భాషలో ఎలీషాద్ధాయి అంటారు
 దీనికి అర్థం అసాధ్యాలను సాధ్యం చేయగల దేవుడు అని. ఈ పేరు బైబిల్ లో 48 సార్లు కనిపిస్తుంది అబ్రాహాము ఈ వాగ్దానాన్ని నమ్మి ఆయన సన్నిధిలో
నిందారహితునిగా ఉన్నాడు గనుకనే దేవుడు తనకిచ్చిన తన స్వథత్రించుకోగలిగాడు
మనం కూడా ఈ వాక్యాన్ని మన హృదయములో ఉంచుకొని దీని ప్రకారంగా జీవించినట్లయితే మనలను కూడా దేవుడు అబ్రాహాములా ఆశీర్వదిస్తాడు
ఈ వాక్యం దేవుడు మన జీవితములో ఎలాంటి అసాధ్యమైన పనులైనా చేయగలడనే నమ్మకాన్ని కలిగిస్తుంది అలాగే ఆయన సన్నిధిలో నిందారహితముగా ఉండాలని మనకు గుర్తు చేస్తుంది
ఆయనకు ఇష్టులముగా ఉండుటకు ఈ వాక్యం ఎంతగానో ఉపయోగపడుతుంది గనుక ఈ రోజంతా
ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దీనిలోని ఆశీర్వాదాలను పొందుకుందాము 

No comments:

Post a Comment