యేసుక్రీస్తు జన్మించిన సమయంలో ఇశ్రాయేలు రాజ్యం రోమా సామ్రాజ్యపు అధీనంలో వుండేది. గలిలయ ప్రాంతంలోని నజరేతను ఊరిలో యోసేపు అను పురుషుడు ఉండేవాడు. అతనికి మరియ అను కన్యతో ప్రధానం జరిగింది. ఒకదినం గబ్రియేలను దూత మరియవద్దకు పంపబడ్డాడు. ఆ దూత మరియతో “దయా ప్రాప్తురాలా! నీకు శుభమగు గాక! దేవుడు నీకు తోడైవున్నాడు. నీవు గర్భముధరించి కుమారుని కంటావు. ఆయనకు యేసు అని
పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. - ఆయన దావీదు వంశస్తులను యుగయుగములు ఏలుతాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై వుంటుంది" అన్నాడు. దేవదూత మాటలకు మరియ ఆశ్చర్యపోయింది. "అయ్యా! నేను పురుషుని ఎరుగని దానను. మీరు చెప్పేది ఎలా నెరవేరుతుంది?” అని అడిగింది. అందుకు ఆ దూత "దేవునికి అసాధ్యమైనది ఏమున్నది? నీవు పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భము ధరిస్తావు. నీకు పుట్టబోయే కుమారుడు పరిశుద్దుడై దేవుని కుమారుడు అనబడతాడు. నీ బంధువు ఎలీసబెతుకు కూడ త్వరలో కుమారుడు కలుగబోతున్నాడు. ఆమె వయస్సు మీరిన వృద్ధురాలు. అయినా దేవుడు ఆమెపై కృప చూపాడు. ఆమె యిప్పుడు ఆరు నెలల గర్భవతి” అని చెప్పి దేవదూత వెళ్ళిపోయాడు. మరియ దూత పలికిన మాటలను మనసులో ధ్యానిస్తూ వుండిపోయింది.
యోసేపు దావీదు వంశస్థుడు, అతడు తనకు ప్రధానము చేయబడిన మరియ గర్భవతి అయిందని తెలిసికొన్నాడు. అతడు నీతి పరుడు. కాబట్టి ఆమెను అవమానించడం యిష్టం లేక రహస్యంగా వదిలిపెట్టాలని ఆలోచిస్తున్నాడు. అయితే ఒక రాత్రి కలలో దేవుని దూత కన్పించి, "యోసేపూ నీ భార్య పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భవతి అయింది. ఆమెను విడనాడవద్దు - ఆమె ఒక కుమారుని కంటుంది. అతడు తనను నమ్మిన ప్రజలందరినీ వారి వారి పాపములనుండి రక్షిస్తాడు. " ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. అని (600 సం||ల క్రిందట) యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట యిప్పుడు నెరవేరబోతుంది" అని చెప్పాడు. యోసేపు దూత చెప్పినట్లుగా మరియను ఆదరించి ప్రేమించాడు
యోహాను పుట్టుక :
యేసు క్రీస్తు జననము మరియ యూదా ప్రదేశంలోని కొండసీమలో వున్న యాజకుడైన జెకర్యా యింటికి వెళ్ళింది. జెకర్యా భార్య ఎలీసబెతు, ఆమె మరియను సాదరంగా ఆహ్వానించింది. ఎలీసబెతు గర్భంలోని శిశువు కూడ సంతోషంతో గంతులు వేసింది. అప్పుడు ఎలీసబెతు పరిశుద్ధాత్మతోనిండుకొని "స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు. నీ గర్భఫలము ఆశీర్వదింపబడును" అన్నది. ఎలీసబెతు ఒక కుమారుని ప్రసవించింది. ఆమె తన కుమారునికి యోహాను అని పేరు పెట్టాలని చెప్పింది. యోహాను యేసుక్రీస్తుకంటె 6 నెలలు పెద్దవాడు. ఈయనే యేసు క్రీస్తుకు యోర్దాను నదిలో బాప్తిస్మము యిచ్చాడు
యేసుక్రీస్తు జన్మించుట :
ఆ రోజులలో ప్రజాసంఖ్య వ్రాయాలని కైసరౌగుస్తు (సీజర్ అగస్టస్) చక్రవర్తి ఆజ్ఞాపించాడు. ప్రజా సంఖ్యలో వ్రాయబడాలంటే ఎవరి స్వంత పూరికి
వారు వెళ్లాలి, అని కూడ ఆజ్ఞాపించాడు. యోసేపు దావీదు వంశస్థుడు కనుక, తనకు ప్రధానము చేయబడిన నిండు గర్భవతిగా వున్న మరియతో కూడ గలిలయ ప్రాంతం నుండి యూదా ప్రాంతపు బెల్లెహేము అను దావీదు పట్టణానికి వెళ్లాడు. వారికి పట్టణంలో బస చేయడానికి యిల్లుగాని, సత్రం
గాని దొరకలేదు. చివరకు ఒక సత్రం యజమాని దయతలచి తన సత్రంలోని పశువుల పాకలో వుండమన్నాడు. అక్కడ మరియ లోక రక్షకుడు, జీవాధిపతి, దేవుని కుమారుడు అయిన యేసును ప్రసవించింది. బిడ్డను పొత్తిగుడ్డలతో చుట్టి, పశువుల తొట్టిలో పరుండ బెట్టింది. “ఆకాశపక్షులకు నివాసములు, నక్కలకు బొరియలున్నవి. కాని మనుష్యకుమారుడు తలదాచుకొనుటకైనను స్థలము
లేదు." అను వాక్యాలు యేసు ప్రభువు విషయంలో నెరవేరాయి. యేసు క్రీస్తు శరీర ధారియై మరియ సుతునిగా 2002 సం||ల క్రితం ఈ భువిపై అవతరించాడు.

గొల్లలు బాల యేసును దర్శించుట :
ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో తమ మందను కాచుకొను చుండగా దేవుని దూత వారి యెదుట నిలిచింది. దూత చుట్టుగొప్ప వెలుగు వ్యాపించి నందున గొల్లలు చాల భయపడ్డారు. ఆ దూత వారితో "భయపడకుడి! ప్రజలకందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణంలో నేడు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు అనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి, పశువుల తొట్టిలో పండుకొని యుండుట మీరు చూస్తారు" అని చెప్పాడు. వెంటనే ఆ దేవదూత ప్రక్కనవున్న దూతలు "సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు యిష్టులైన వారికి భూమిమీద సమాధానము కలుగును గాక" అని దేవునికి స్తోత్రము చేయసాగారు. గొర్రెల కాపరులు వెంటనే బయలుదేరి బెల్లెహేముపురం చేరారు. బాల యేసును దర్శించారు. పరమానంద భరితులయ్యారు. తర్వాత తాము చూసిన, వినిన సంగతులను అందరికీ వివరిస్తూ, దేవునికి స్తోత్రం చేస్తూ తమ తమ యిండ్లకు వెళ్లారు.

జ్ఞానులు బాలయేసును పూజించుట :
తూర్పు దేశాలకు చెందిన ముగ్గురు జ్ఞానులు ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రాన్ని చూశారు. ఎవరో ఒక యుగ పురుషుడు జన్మించాడని తెలిసి
కొన్నారు. ముందుగా వారు యూదా దేశపు రాజైన హేరోదు దగ్గరికి వెళ్ళారు. "యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ వున్నాడు?” అని అడిగాడు. రాజాస్థానం లోని పండితులు - "ఆయన యూదయ దేశంలోని బెల్లె హేములో జన్మించాడని" తెలిపారు. ఈ సంగతి విన్న హేరోదు రాజు చాల అసూయపడ్డాడు. అయితే “మీరు వెళ్ళి, ఆ బాలుని దర్శించి, వచ్చి నాతో చెప్పండి. తర్వాత నేను కూడ వెళ్ళి చూస్తాను" అన్నాడు. నక్షత్రం ఆ కాశంలో ప్రయాణం చేసి పశువుల పాకపైన ఆగింది. జ్ఞానులు బాల యేసును పూజించారు. బంగారము, సాంబ్రాణి, బోళము సమర్పించారు. స్వప్నంలో దేవుడు చెప్పిన విధంగా, హేరోదు రాజు దగ్గరికి వెళ్ళకుండా వేరొక మార్గాన తమ దేశాలకు తిరిగి వెళ్ళిపోయారు.
ఎనిమిదవ దినము యోసేపు మరియలు బాలుణి యెరూషలేము ! దేవాలయానికి తీసికొని వెళ్లారు. దేవదూత చెప్పినట్లుగా 'యేసు' అని పేరు పెట్టారు. ధర్మశాస్త్రము ననుసరించి ప్రతి తొలి చూలు బిడము దేవునికి ! ప్రతిషింప వలసి వుంది. ఎనిమిదవ రోజు మగపిల్లలకు సున్నతి జరిగించు ! ఆచారము కూడ వున్నది. ఆ రోజుల్లో యెరూషలేములో సుమయోను అను ఒక మనుష్యుడు వుండేవాడు. అతడు నీతి మంతుడు, మరియు భక్తి పరుడు. ఇశ్రాయేలు ప్రజల
ఆదరణ కొరకు కనిపెడుతూ వుండేవాడు. యేసును చూసిన తర్వాతనే నీవు మరణిస్తావు. అని పరిశుద్దాత్మ అతనితో చెప్పి వుంది. సుమయోను బాల
యేసును చూసి మురిసిపోయాడు. దేవుణ్ణి స్తుతించాడు. ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు గాను, మహిమగాను, రక్షకునిగాను ఉద్భవించిన యేసును కన్నులార గాంచిన తన జీవితం ధన్యమైందని సంతోషించాడు. 84 సం||ల వయసున్న "అన్న" అను ప్రవక్తి కూడ బాలయేసును దర్శించి చాల సంతోషించింది.

ఐగుప్తుకు పారిపోవుట :
జ్ఞానులు తన దగ్గరికి రాకుండా వెళ్ళిపోయారని తెలిసికొన్న హేరోదు రాజు, నిజంగానే యూదుల రాజు జన్మించాడని నమ్మి, రెండు సం||లోపు వయసున్న మగ పిల్లలనందర్నీ చంపి వేయమని ఆజ్ఞాపించాడు. కొన్ని వేలమంది మగ బిడ్డలు చంపబడ్డారు. అయితే దేవుని దూత ఐగుప్తుకు పారిపొమ్మని హెచ్చరించినందున యోసేపు తన భార్య మరియను, బాల యేసును తీసికొని ఐగుప్తుకు పారిపోయాడు. హేరోదు రాజు చనిపోయిన తర్వాత దేవదూత ఆదేశం
ప్రకారం ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చి నజరేతను వూరిలో కాపురమున్నాడు. "ఆయన నజరేయుడని పిలువబడును" అని యేసుక్రీస్తు విషయంలో ప్రవక్తలు
చెప్పిన మాట ఈ విధంగా నెరవేరింది. యేసు జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయలో మనుషుల దయలో వర్థిల్లు చుండెను. 30 సం||ల వయస్సు వరకు ఆయన తండ్రి అయిన యోసేపుకు వడ్రంగి పనిలో సాయం చేశాడు. తర్వాత మూడున్నర సం॥ల పాటు యూదయ, గలిలయ ప్రాంతమంతా సంచరించాడు. దేవుని రాజ్యాన్ని గురించి బాధించాడు. దయ, కనికరము, ప్రేమ, క్షమ, సత్యము అంటే ఏమిటి వివరించాడు. రోగులను బాగు చేశాడు. దయ్యాలను పారద్రోలాడు. పాపులను క్షమించాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. యేసుక్రీస్తును బట్టి కాలము క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము అని రెండు భాగాలుగా విభజింపబడింది.

అర్థములు :
యేసు = రక్షకుడు,
క్రీస్తు = అభిషిక్తుడు,
ఇమ్మానుయేలు = దేవుడు మనకు తోడు
క్రీస్తు = అభిషిక్తుడు,
ఇమ్మానుయేలు = దేవుడు మనకు తోడు
పాతనిబంధన భాగములు
యెషయా 7:14, మీకా 5:17, యిర్మియా 31:15,16

ధ్యానాంశములు
1.యేసు క్రీస్తుపరిశుద్ధాత్మ వలన పుట్టినవాడు. ఆయన దేవుని కుమారుడు

2.ఆయన పుట్టుట వలన ప్రవక్తల ప్రవచనాలు నెరవేరాయి ఆయన దేవుడై వుండీ దీనుడుగా పుట్టాడు
3.యేసుక్రీస్తు మానవ రూపియై భువికి వచ్చినందున మానవులందరికి రక్షణ పొందే భాగ్యం లభించింది. యేసు క్రీస్తు అందరికి ప్రభువు లోక రక్షకుడు.
4.ఆయన పుట్టుకలోని ప్రతి అంశము ఒక అద్భుతము. మరియమ్మ నిజంగానే ధన్యురాలు
బంగారు వాక్యము
ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు.
మత్తయి 1:22 *

No comments:
Post a Comment