యెహోషువ నూను అను వ్యక్తి యొక్క కుమారుడు. యితడు మోషేకు నమ్మకమైన సేవకుడు. యెహోషువ యొక్క మొదటి పేరు హోషేయ. మోషే అతనికి యెహోషువ అని పేరు పెట్టాడు. యెహోషువ గొప్ప యుద్ధవీరుడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు. మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు నాయకత్వం వహించిన వాడు. ఎన్నో యుద్ధాలు చేసి, శతృవుల పై విజయం సాధించిన వాడు. దేవుడు యెహోషువాకు, కాలేబుకు పాలుతేనెలు ప్రవహించే పవిత్ర దేశం కనానులో ప్రవేశించే మహాభాగ్యం అనుగ్రహించాడు. యెహోషువ ఒక్క రోజులో అమాలేకీయుల సైన్యాన్ని ఓడించాడు. మోషే వెంట సీనాయి కొండ ఎక్కాడు. మోషే 10 ఆజ్ఞలు వున్న రాతి పలకలతో దిగివచ్చునప్పుడు ఆయన వెంట వున్నాడు.
ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దాటుట :
మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువతో యిలా చెప్పాడు. “నీవు ధైర్యంగా వుండు. నీ జీవిత కాలంలో ఏమనుష్యుడు నీ ఎదుట నిలువలేడు. నేను మోషేకు తోడై వున్నట్లు నీకు కూడ తోడై వుంటాను.
నీవు ధర్మశాస్త్రమును క్రమం తప్పక ఆచరిస్తూ వుండు” యెహోషువ యిద్దరు వేగుల వారిని పంపాడు. యెరికోపట్టణపు రహస్యాలు తెలిసికొని రమ్మన్నాడు. వారిని రాహాబు అనే వేశ్య రక్షించి, ఆదరించింది. వారు యెహోషువ దగ్గరికి తిరిగి వచ్చారు. "ఆ దేశాన్ని యెహోవా మనకు అప్పగించబోతున్నాడు. ఆ దేశ నివాసులందరు ధైర్యం కోల్పోయి వున్నారు” అని తెలియజేశారు. మరునాడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరిని సిద్ధం కమ్మన్నాడు. “యెహోవా మీ పట్ల అద్భుత కార్యాలు
చేయబోతున్నాడు” అని చెప్పాడు. యాజకులు దేవుని మందసం మోస్తూ ముందు నడిచారు. వారి పాదాలు సోకగానే యోరానునది రెండుగా చీలిపోయింది. ప్రవాహము ఆగిపోయింది. ఇశ్రాయేలీయులు ఆరిన నేలమీద నడిచినట్లు, యోర్దాను నదిని దాటి గిల్లాలుకు చేరారు. అక్కడ యెహోషువు 12 రాళ్ళను - దేవుడు వారికి చేసిన మేలుకు గుర్తుగా నిలబెట్టించాడు. ఇశ్రాయేలు
ప్రజలు ఐగుప్తులో బయలుదేరి 40 సం॥లు గడిచిపోయాయి. యెహోషువు పస్కా పండుగ ఆచరింపచేశాడు. అప్పుడు ఆకాశం నుండి కురుస్తున్న మన్నా (ఆహారము) ఆగిపోయింది.
యెరికోగోడలు కూలి పోవుట :
దేవుడు యోహోషువతో యిలా చెప్పాడు. "మీరందరు యుద్ధానికి సిద్ధపడండి. దేవుని మందసానికి ముందు కొందరు బూరలు ఊదుతూ సాగిపోవాలి. తక్కిన వారందరుమందసం వెంబడి మౌనంగా నడవాలి. ఈ
విధంగా ఆరు రోజులు చేయాలి. ఏడవ రోజు మాత్రం యెరికో ప్రాకారం చుట్టూ ఏడు సార్లు తిరగాలి. ఏడవసారి నీవు ఆజ్ఞ ఇవ్వగానే యోధులందరు
పెద్దగా కేకలు వేయాలి. అప్పుడు యెరికో పట్టణపు గోడలు కూలిపోతాయి. మీరు ఆ పట్టణాన్ని లోబరచుకొని, దానిని పూర్తిగా నాశనం చేయాలి. యెరికో శపించబడిన నగరము. ఎవడైనా యెరికొ పట్టణంలోని వస్తువులను, వెండిది బంగారాన్ని తెచ్చి దాచుకొంటే వాడు శపించబడతాడు” యెహోషువ దేవుని ఆజ్ఞను పూర్తిగా పాటించాడు. ఏడవ దినం ఇశ్రాయేలు ప్రజలు పెద్దగా కేకలు వేయగానే యెరికో గోడలు కూలిపోయాయి. ఇశ్రాయేలీయులు యెరికో
పట్టణాన్ని లోబరచుకొన్నాడు. సర్వనాశనం చేశారు. ప్రజలందరిని, పశువులను సంహరించారు. అయితే రాహాబుకు ఆమె కుటుంబ సభ్యులకు ఏలాంటి హాని
కలిగించలేదు.
హాయి చాలా చిన్న పట్టణము. దానిని సులభంగా ఓడించవచ్చని ఇశ్రాయేలీయులు తలంచారు. కాని హాయి సైనికులు ఇశ్రాయేలు సైనికులను తరిమికొట్టారు. ఇశ్రాయేలు ప్రజలుగుండెలు కరిగిపోయాయి. యెహోషువ చాలా చింతించాడు. ఇశ్రాయేలు వాడైన ఆకాను యెరికో పట్టణం నుండి ఒక మంచి షీనారు వస్త్రాన్ని, 200 తులముల వెండిని, 50తులముల బంగారు కడ్డీని దొంగిలించి, తన డేరా మధ్యలో దాచి పెట్టాడు. అతడుతన తప్పు అంగీకరించాడు. ప్రజలు ఆకానును అతని కుటుంబ సభ్యులను రాళ్లతో కొట్టి చంపారు. అప్పుడు దేవుని కోపం చల్లారింది. హాయి పట్టణాన్ని ఎలా ఆక్రమించుకోవాలో ! వివరించాడు. ఆ పట్టణాన్ని దోచుకొనవచ్చును అని చెప్పాడు.
హాయి పట్టణాన్ని జయించుట :
యెహోషువ తన సైన్యాన్ని రెండు భాగాలుగా చేశాడు. 5000 మందిని హాయికి పడమటి వైపున రహస్యంగా వుంచాడు. తాను కొంత సైన్యంతో ఉత్తరం వైపు దండెత్తాడు. హాయివారు ఇశ్రాయేలు వారిని, యింతకు ముందు వలె సులభంగా తరిమి వేయవచ్చు అనుకొన్నారు. వాళ్ళు యెహోషువ సైన్యాన్ని
తరుముతూ చాలా దూరం వెళారు. యెహోషువ వెనక్కు తిరిగి తన చేతిలోవున్న ఈటెను హాయి వైపు చాచాడు. అప్పుడు దాగి వున్న ఇశ్రాయేలు సైనికులు
హాయిలో ప్రవేశించి, దానిని తగులబెట్టారు. మంటలు చూసిన హాయి సైనికులు వెనక్కు తిరిగారు. అప్పుడు యెహోషువ సైన్యం వారిని తరిమి చంపింది.
హాయిని ఆక్రమించిన సైనికులు కూడ వచ్చారు. హాయి సైనికులు మధ్యలో చిక్కుబడిపోయారు. ఆదినం 12 వేల మంది హాయి పట్టణం సైనికులు
'చంపబడ్డారు. హాయి రాజు ఉరితీయబడ్డారు.
వడగండ్ల వర్షము కురియుట : సూర్యచంద్రులు ఆగిపోవుట :
ఇశ్రాయేలు ప్రజలు యెరికో, హాయి పట్టణాలను లోబరచుకొన్నారని చుట్టు ప్రక్కల వున్న రాజులకు తెలిసింది. రాజులు, వారి ప్రజలు భయకంపితులయ్యారు. గిబియోను వారు మారు వేషాల్లో వచ్చి యెహోషువ దగ్గర అభయం పొందారు. యెరూషలేము రాజు హెబ్రోను, యర్మూతు, లాకీషు,
ఎసీను రాజులను కలుపుకొని గిబియోనుపై దండెత్తారు. ఈ సంగతి తెలిసిన యెహోషువ వారిని రక్షించడానికి గిల్లాలు నుండి బయలుదేరాడు. అప్పుడు యెహోవా “నీవు శతృవులకు భయపడవద్దు. వారు ఏకమై వచ్చారు. అయినా
పారిపోతారు” అని చెప్పాడు. యెహోషువ సైన్యం అకస్మాత్తుగా శతృవులపై పడగా వారు కలవరపడి పారిపోయారు. ఇశ్రాయేలు సైనికులు వారిని తరిమి
తరిమి చంపారు. శతృవులు (అమోరీయులు) పారిపోతుండగా యెహోవా వారిపై వడగండ్ల వర్షం కురిపించాడు. యుద్ధంలో చనిపోయిన వారికంటె వడగండ్ల వర్షం వలన ఎక్కువ మంది చనిపోయారు.
ఆమోరీయులతో యుద్ధం జరుగుతున్న రోజు యెహోషువ 'సూర్యుడా! నీవు గిబిమోనులో నిలువుము. చంద్రుడా! నీవు అయ్యాలోను లోయలో ఆగిపో” అని యెహోవా పేరిట ఆజ్ఞాపించాడు. యుద్ధం పూర్తయ్యే వరకు సూర్యచంద్రులు ఆగిపోయారు. ఒక నరుని మాట విని దేవుడు సూర్య చంద్రులను ఆపివేయడం ఆ రోజుకు ముందుగాని, తర్వాతగాని సంభవింపలేదు. యెహోషువ మక్సేనా గుహలో దాక్కొన్న అయిదుగురు శతృరాజులను బంధించి తెచ్చి, అయిదు చెట్లకు ఉరితీయించాడు.
రాజులందరిని జయించుట :
యెహోషువ తన సైన్యంతో మక్సేనా, లిబ్బా, లాకీషు, గెజెరు, ఎగ్లోను, దెబిరు, షెఫీలా మన్యములను ఓడించాడు. రాజులను జయించాడు. పట్టణాలను
కొల్లగొట్టాడు. హాసోరు రాజైన యాబీను చాలామంది రాజులను కూడగట్టుకొని యెహోషువను ఎదిరించాడు. కాని యెహోవా దేవుడు “నీవు భయపడి వద్ద రేపు ఈ వేళకు నీ శతవులు సంహరింపబడతారు" అని చెప్పాడు. దేవుడు
చెప్పినట్లుగానే శత్సరాజులు పారిపోయారు. యెహోషువ 31 మంది రాజులను ఓడించాడు. గిబియోను వారితో మాత్రమే సంది చేసికొన్నాడు. యెహోషువ కాదేషునుండి గాజా, గిబియోను వరకు వ్యాపించిన విశాలమైన ప్రాంతాన్ని జయించాడు. తర్వాత తాను జయించిన దేశాలన్నింటిని ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి పంచాడు.
యెహోషువ మరణము : -
యెహోవా దేవుడు తాను చేసిన వాగానం నెరవేర్చాడు. ఇశ్రాయేలీయులకు కనాను దేశం యిచ్చాడు. అక్కడ ప్రజలు సుఖశాంతులతో జీవింప
సాగారు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో యిలా అన్నాడు. యెహావా మనపట్ల చేసిన ఆశ్చర్వకార్యములు మీరు చూసి వున్నారు. ఆయనే మన పక్షంగా యుద్దాలు చేశాడు. మన శతృవులను నాశనం చేశాడు. మీరు సేద్యం చేయని సారవంతమైన దేశాన్ని, కట్టని పట్టణాలను, నాటని పండ్లతోటలను మీకు యిచ్చాడు. మీరు అన్యుల దేవతలను, విగ్రహాలను పూజిస్తే నశించిపోతారు. కనుక యెహోవానే సేవించండి" అని ఉపదేశించాడు. ఇశ్రాయేలు ప్రజలు “మేము యెహోవానే సేవిస్తాము. ఆయన ఆజ్ఞలే పాటిస్తాము" అని ప్రమాణం
చేశారు. యెహోషువ 110 సం||లు జీవించాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించి, వారి కొరకు యుద్ధాలు చేసి, వారిని వాగ్దత్త దేశమైన కనాను దేశానికి చేర్చాడు.
ధ్యానాంశములు :
1. యెహోషువ మహావీరుడు. దేవునికి, మోషేకు పూర్తి విధేయుడుగా వున్నాడు.
2. దేవుని ఆజ్ఞలను పాటించాడు. కనుకనే శతృవులను జయించాడు.
3. యెహోషువ అను హెబ్రీ మాటకు “రక్షకుడు” అని అర్ధము.
4. యెహోషువ ఆజ్ఞాపించగా సూర్యచంద్రులు ఆగిపోయారు. దేవునియందు సంపూర్ణ విశ్వాసం కలిగి వుంటే మన జీవితంలో కూడ అద్భుతాలు
జరుగుతాయి.
5. యెహోషువ ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి న్యాయంగా కనాను దేశాన్ని పంచి పెట్టాడు.
బంగారు వాక్యము :
నిన్ను విడువను యెడబాయను. నిబ్బరము గలిగి ధైర్యముగానుండుము.
యెహో. 1:6
No comments:
Post a Comment