Breaking

Friday, 11 October 2019

Bible story of Abraham | bible stories in telugu | అబ్రాహాము


అబ్రాహాము యెహోవా దేవుని మాటలు నమ్మి, ఆయనకు పూర్తి విధేయత చూపాడు. పాత నిబంధన గ్రంథంలో అబ్రాహాము చాల ముఖ్యుడు. అపోస్తలుడైన పౌలు విశ్వాసవీరుల జాబితాలో అబ్రాహాము పేరును ప్రముఖంగా ఉదహరించాడు. బైబిలులో అబ్రాహామును గురించిన ప్రశంస చాలాచోట్ల వుంది. అబ్రాహాము విశ్వాసము, విధేయత మూలంగా ఎంతగానో ఆశీర్వదింపబడ్డాడు. విశ్వాసులకు మూల పురుషుడు
(Father of believers) అని పిలువ బడ్డాడు.

తెరహు కుమారులు అబ్రాము, నాహోరు, హారాను. హారాను తన తండ్రికంటే ముందే చనిపోయాడు. హారాను కుమారుడు లోతు, తెరహు అబ్రామును, అతని భార్య శారయిని, లోతును వెంటబెట్టుకొని కల్దీయుల పట్టణమైన "ఊరు" నుండి, "కనాను" దేశానికి బయలు దేరాడు. తెరహు 200 ఏండ్లు బ్రతికి, హారానులో చనిపోయాడు.

యెహోవా అబ్రాముతో యిలా అన్నాడు. “నీవు నీ బంధువులను వదిలి పెట్టి నేను చూపించే కనాను దేశానికి వెళ్లు. నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను. నీ పేరును గొప్ప చేసి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను. నిన్ను శపించే వారిని శపిస్తాను” అన్నాడు. అబ్రాము దేవుని ఆదేశం పాటించాడు. డెబ్బది ఐదేండ్ల వయసులో భార్య అయిన శారయిని, తమ్ముని కుమారుడగు లోతును తీసికొని కనాను దేశం వెళ్లాడు. బేతేలుకు తూర్పున హాయి' వద్ద గుడారం వేసికొని కొంత కాలం
వున్నాడు.

కనాను దేశంలో గొప్ప కరవు వచ్చింది. అబ్రాము తన భార్యను వెంట పెట్టుకొని ఐగుప్తుకు వెళ్ళాడు. శారయి చాలా అందమైనది. కనుక శారయి. తన సహోదరి అని అబద్దం చెప్పాడు. అయితే నిజం తెలిసికొన్న ఫరో చక్రవర్తి దేవునికి భయపడి, శారయిని పంపివేశాడు. అబ్రాము మొదట తానున్న చోటికే
వచ్చాడు. అబ్రాముకు లోతుకు విస్తారమైన పశుసంపద వుంది. వారి పశువులకు, గొర్రెలకు ఆ ప్రాంతం సరిపోలేదు. అంతేకాక యిద్దరి పశువుల కాపరులు తగవులాడుకోసాగారు. అందుచేత అబ్రాహాము లోతుతో - "మనం విడిపోయి దూర ప్రదేశాల్లో వుండటం మంచిది” అని సలహాయిచ్చాడు. అందుకు లోతు సరే అన్నాడు. తూర్పు దిక్కున వున్న సొదొమ, గొమెర్రా పట్టణాల వైపు వెళ్ళాడు.
అబ్రాము కనానులోనే వుండిపోయాడు. కొన్ని సం||రాల తర్వాత హెబ్రోనులోని మఘే దగ్గర వున్న సింధూర వృక్షవనంలో వున్నాడు. అబ్రాము దగ్గర
సుమారు రెండువేల మంది మనుష్యులు, వేలకొలది గొర్రెలు, పశువులు వుండేవి. అతడు చాల ధనవంతుడు. కనుక చుట్టుప్రక్కల వున్న రాజులు అబ్రామును చాల గౌరవించేవారు.

ఒక దినము అబ్రాము యెహోవాతో మాట్లాడుతూ యిలా అడిగాడు "దేవా! నీవు నాకు అధిక సంపదను, దాస దాసీలను యిచ్చావు. కాని ఏవి? లాభము? సంతానం యివ్వలేదు కనుక నా దాసులలో ఒకడు నాకు నారసుడు. అవుతాడు కదా!” అందుకు యెహోవా “నీకు ఒక కుమారుడు కలుగుతాడు.
నీ సంతానము ఆకాశంలోని నక్షత్రములవలె, లెక్క పెట్టలేనంతగా అభివృద్ధి చెందుతుంది.” అన్నాడు. అబ్రాము దేవుడు చేసిన వాగ్దానాన్ని విశ్వసించాడు.
చాల కాలం వరకు శారయికి సంతానం కలుగలేదు. అందువల్ల ఆమె తన దాసి అయిన హాగరును అబ్రాముకు యిచ్చింది. హాగరుకు ఒక కుమారుడు
పుట్టాడు. అతని పేరు ఇష్మాయేలు. అబ్రాము 99 సం||లవాడయ్యాడు. దేవుడతనికి ప్రత్యక్షమై యిలా అన్నాడు. “శారయివలన కలుగబోయే సంతానమే
నీ అసలైన సంతానము" నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను. నీలో నుండి అనేక వీరులు, రాజులు, ప్రవక్తలు జన్మిస్తారు. నీవు యిక నుండి “అబ్రాహాము"(జనములకు తండ్రి) అని, నీ భార్య “శారా"(రాజకుమారి) అని పిలవబడతారు. మీరు బహుగా ఆశీర్వదింపబడతారు.

ఒక రోజు ముగ్గురు మనుష్యులు (దేవదూతలు) అబ్రాహాము గుడారము దగ్గరకి వచ్చారు. అబ్రాహాము వారిని ఆదరించి, భోజనం పెట్టాడు.
భోజనం చేసిన తర్వాత ఆ మనుష్యులు "వచ్చే ఈ కాలానికి నీ భార్య శారా తల్లి అవుతుంది" అని ఆశీర్వదించారు. వారి మాటలు వినిన శారా నవ్వింది.
ఎందుకంటే అప్పుడు శారా వయస్సు 90 సం||లు. అబ్రాహాము వయస్సు 99 సం||లు. ఆ మనుష్యులు వెళ్ళబోయే ముందు "యెహోవాకు అసాధ్యమైనది
ఏమీలేదు. మా మాట తప్పక నెరవేరుతుంది” అన్నారు. ఆ మనుష్యులే “సొదొమా, గొమొర్రా పట్టణాలు అగ్ని గంథకములతో నాశనం కాబోతున్నా
యని” చెప్పారు. ఆ పట్టణాలలో కనీసం 10మంది నీతి మంతులున్నా ఆ పట్టణాలను నాశనం చేయవద్దని అబ్రాహాము దేవదూతలను బ్రతిమిలాడాడు.

అబ్రాహాముకు 100 సం||ల వయస్సు వచ్చింది. అప్పుడు శారాకు ఇస్సాకు అను కుమారుడు పుట్టాడు. మనుష్యులు అసాధ్యం అనుకొన్నవాటిని,
దేవుడు సుసాధ్యం చేయగలడు. అనే సత్యము అబ్రాహాము, శారాల విషయంలో నిజమైంది.
ఇస్సాకు సంతానం క్రమ క్రమంగా లక్షల సంఖ్యకు విస్తరించింది. యూదులు, హెబ్రీయులు, ఇశ్రాయేలీయులు అనే పేర్లతో ప్రపంచ చరిత్రలో
ప్రముఖ స్థానం పొందింది. యెహోవా ఆజ్ఞను పాటించి అబ్రాహాము హాగరును, ఆమె కుమారుడు ఇష్మాయేలును దూర ప్రాంతానికి పంపింవేశాడు.


ఇస్సాకు పెరిగి పెద్దవాడయ్యాడు. దేవుడు అబ్రాహాముకు ఒక పరీక్ష పెట్టాడు. నీకు వున్న ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకును నాకు బలి యివ్వమని కోరాడు. అబ్రాహాము దేవుని ఆజ్ఞను శిరసావహించాడు. ఇస్సాకును, ఒక గాడిదపై కట్టెలను తీసికొని బయలుదేరాడు. మోరియా దేశంలో దేవుడు చెప్పిన పర్వతం దగ్గరికి వెళ్లాడు. పనివాండ్లను క్రిందనే వుండమన్నాడు. “మేము వెళ్ళి యెహోవాకు మొక్కి (యిద్దరము) తిరిగి వస్తాము" అని అన్నాడు. ఆ
కట్టెలు ఇస్సాకు తలపై వుంచాడు. తాను కత్తిని, నిప్పును తీసికొని కొండ ఎక్కుతున్నాడు. దారి మధ్యలో ఇస్సాకు, తండ్రీ! దహన బలికి కట్టెలు, నిప్పు
వున్నాయి. కాని గొర్రెపిల ఏది?" అని అడిగాడు. అందుకు సమాధానంగా అబ్రాహాము "నా కుమారుడా ! గొర్రెపిల సంగతి దేవుడే చూసుకొంటాడు" (యెహోవా ఈరె) అన్నాడు. యిదరూ కొండపైకి చేరారు. అబ్రాహాము బలి
వలము కట్టి, కట్టెలు పేర్చి, వాటిపై ఇస్సాకును పరుండబెట్టాడు. కత్తితో ఇస్సాకును బల యివ్వడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు యెహోవా దూత అతన్ని ఆపాడు, నీవుని ఏకైక కుమారుణ్ణి నాకు బలిగా యివ్వడానికి సిద్ధపడ్డావు, అందుకు నేను సంతోషిస్తున్నాను” అన్నాడు. అబ్రాహాముకు పొదలోకొమ్ములు తగులుకొనివున్న ఒక పొట్టేలు కనిపించింది. అతడు దానిని ఇస్సాకునకు ప్రతిగా దేవునికి బలి యిచ్చాడు. అబ్రాహాము ఆ చోటికి "యెహోవా ఈరే” అని పేరు పెట్టాడు. అతడు ఇస్సాకును, దాసులను వెంట పెట్టుకొని బెయెరైబాకు తిరిగి వెళ్ళాడు.

శారా 127 సం||లు జీవించింది. ఆమె మృత దేహాన్ని అబ్రాహాము తాను కొని వుంచిన మమే ఎదుట వున్న మక్సేలా గుహలో పాతి పెట్టాడు.
అబ్రాహాము వృద్ధుడయ్యాడు. అతనికి అన్యుల కన్యను తన కోడలిగా వేసుకోవడం ఇష్టం లేదు. కాబట్టి తన ప్రధాన దాసుడైన ఎలియాజరును నాహోరుకు పంపాడు. ఎలియాజరు ఆ పట్టణానికి వెళ్ళాడు. అక్కడ బెతూయేలు కుమార్తె, లాబాను సోదరి అయిన రిబ్కా ఇస్సాకునకు తగిన కన్య అని గ్రహించాడు. రిబ్కా చాల అందమైనది. వినయ విధేయతలు గలిగిన యువతి. అమె ఎలియాజరు వెంట వెళ్ళడానికి సమ్మతించింది. అమె అన్న, తండ్రి కూడ సమ్మతించారు. రిబ్కా ఎలియాజరు వెంట కనాను దేశం వెళ్ళింది. దారిలో ఇస్సాకు ఎదురయ్యాడు. రిబ్కా గౌరవసూచకంగా ఒంటె పెనుండి దిగి, ముఖానికి ముసుగు వేసికొన్నది. ఇస్సాకు ఆమెను వివాహం చేసికొన్నాడు. అతడు రిబ్కాను ఎక్కువగా ప్రేమించాడు.

శారా మరణించిన తర్వాత అబ్రాహాము కెతూరా అను స్త్రీని పెండ్లి చేసికొన్నాడు. ఆమె ద్వారా అతనికి చాల మంది సంతానం కలిగారు. అబాహాము నారందరికి బహుమతుఇచ్చి పంపివేశాడు. తన ఆస్తినంతటిని
ఇస్సాకుకు యిచ్చాడు. అబ్రాహాము 175 సం||ల వయస్సులో మరణించాడు. అతని మృత శరీరాన్ని కూడ మక్సేలా గుహలో పాతి పెట్టారు.


ధ్యానాంశములు :

1.అబ్రాహాము ఒక భక్తుడు. దేవుని యెడల, ఆయన మాటల యెడల అచంచల విశ్వాసం కలవాడు. కనుకనే "విశ్వాసులకు తండ్రి” అని
పిలువబడ్డాడు. అబ్రాహాము దేవుని ఆజ్ఞలను పూర్తిగా పాటించాడు. తన స్వదేశం వదిలి పెట్టాడు, కుమారుని బలియివ్వడానికి కూడ సిద్ధమయ్యాడు. కనుక
బహుగా ఆశీర్వదింపబడ్డాడు. అబ్రాహాము దేవునితో మాట్లాడాడు. తనకు సంతానం యివ్వమని
ప్రార్ధించాడు. సొదొమ, గొమొర్రా పట్టణాలలో 10 మంది నీతిమంతులున్నా ఆ పట్టణాలను నాశనం చేయ వద్దని బ్రతిమిలాడాడు.

4. అబ్రాహాము మంచి వీరుడు, ధర్మం కోసం పోరాడేవాడు. యుద్ధం చేసి సొదొమా రాజును విముక్తుణ్ణి చేశాడు.

5. అబ్రాహాము దైవభక్తి గలవాడు. షాలేము రాజైన మెల్కీసెదెకు దేవుని యాజకుడు. అతడు అబ్రాహామును ఆశీర్వదించాడు (ఆది 14:18)

6. అబ్రాహాము జీవితము ఆదర్శ జీవితము. విశ్వాసులందరికి అను సరణీయమైన జీవితము.


బంగారు వాక్యము :

అబ్రాహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను.
యాకోబు 2:23.



1 comment:

  1. This is some wrong story, because, ismailunu devudu evoha bali Ivvamani korindi, isshakunu kadhu bro, please review and change

    ReplyDelete