ప్రార్ధనాపరుడైన హైడ్ గా పిలువబడిన జాన్ హైడ్ అనే దైవజనుడు ఒకసారి మీటింగ్స్ కి పిలువబడినాడు. ఆ మీటింగ్స్ లో అతనితోపాటు మరొక ఇద్దరు మిషనరీలకు ఒకే గదిలో ఉండుటకు ఏర్పాటుచేసినారు...
ఈ ముగ్గురు సేవకులు ఒకే గదిలో ఉండగా, ఒకానొక రోజు జాన్ హైడ్ వేకువనే లేచి ప్రార్దించుట కొరకు మోకాళ్ళూనినాడు. ఇది తన తోటి మిషనరీ గమనించాడు. ఈ మిషనరీ ఉదయం అల్పాహారం తీసుకొనుటకు బయటికి వెళ్లి ఉదయం 6 గం౹౹లకు తన గదికి వొచ్చి చూడగా జాన్ హైడ్ అలాగే మోకాళ్ళ మీదనే ఉండిపోయాడు...
ఈ మిషనరీ మరలా ఉదయకాల ప్రార్ధన కూడికకు వెళ్లి, తిరిగి మధ్యాహ్నం 12:30గం౹౹లకు తన గదికి రాగా జాన్ హైడ్ ఇంకా మోకాళ్ళమీదనుండి లేవలేదు.. అలాగే ప్రార్ధిస్తూ ఉన్నాడు..
మరలా ఈ మిషనరీ సాయంత్ర కూటమునకు వెళ్లి సాయంత్రము 6 గం౹౹లకు తిరిగి తన గదికి రాగా జాన్ హైడ్ ఇంకా మోకాళ్ళమీదనుండి లేవలేదు. అలాగే ప్రార్ధిస్తూ ఉండిపోయాడు.... జాన్ హైడ్ యొక్క ప్రార్ధన జీవితాన్ని చూసిన ఆ మిషనరీ బహుగా ఆశ్చర్యపడి ఎప్పుడు మోకాళ్ళమీదనుండి లేస్తాడా అని వేచి చూస్తూ ఉండగా, అరగంట గడిచాక సాయంత్రం 6:30 ని౹౹లకు హైడ్ మోకాళ్ళమీదనుండి లేచాడు...
తెల్లవారకముందే మోకాళ్ళూని, సాయంత్రం 6:30గం౹౹లకు మోకాళ్ళమీదనుండి లేచిన జాన్ హైడ్ యొక్క ముఖము చూసినప్పుడు అతని ముఖం ప్రకాశిస్తూ ఉండడం ఆ మిషనరీ గమనించాడు...,
ఆ మిషనరీ హైడ్ ని ఇలా అడిగాడు.. "ఇంతసేపు ప్రార్దించుటకు గల హేతువేమి..?" అని...
దానికి సమాధానంగా హైడ్ చిరునవ్వు నవ్వి ... "నేను దర్శనములో ప్రభువును చూస్తున్నాను.. ఆయన నా కొరకు మరియు సమస్త మానవాళి కొరకు దరిద్రుడైపోయినాడు... ఎవరూ చూడనొల్లనివాడైపోయినాడు.." అంటూ పిల్లవానివలె కన్నీరు విడుస్తూ ఆ మిషనరీకి సమాధానమిస్తూ ఉండగా అది విన్న మిషనరీ కూడా ప్రభువు సిలువ ప్రేమను జ్ఞాపకము తెచ్చుకొని కన్నీటి పర్యంతమయ్యాడట....!!
Idemi daridramra babu. Yesu ki bharathadesaniki emitra babu sambhandham. Miru mi edupu mukhalu
ReplyDelete