* మనం శ్రమల మూలంగా మచ్చలేని వాళ్లంగా అవుతాము. దేవుని పిల్లలు విధేయత అనే శిక్షణ పొంది శ్రమల ద్వారా మహిమలోకి ప్రవేశిస్తారు
* నీవు వెళ్ళవలసిన దారి గురించి ఏమైనా సందేహం ఉంటే దాన్ని వెంటనే ప్రభువుకి అప్పగించు వెళ్ళవలసిన ద్వారం తప్ప మిగతా తలుపులన్నింటిని మెసేయ్యమని అడుగు
ఆయన నిన్ను ఒక పని చేయనివ్వకుండా ఏమాత్రం అడ్డుపెట్టిన విధేయుడవ్వడానికి నువ్వు సిద్ధముగా ఉండాలి
* నీ పరమ వైద్యుడు నీ గాయాలకు కట్లు కడుతుంటే దాన్ని చూసి నువ్వు కూడా ఇతరుల గాయాలకు చికిత్స చేయడం నేర్చుకోవాలి
మనల్ని దేవుడు ఓదార్చేది మనల్ని ఓదార్చడానికే కాదు మనల్ని ఓదార్చేవాళ్లుగా చేయడానికే
* ఎవ్వరికీ లేనంత సానుభూతి ఆయనకు నీ పట్ల ఉంది నీ భాధలన్నింటిలోను ఆయన పై సంపూర్ణంగా ఆనుకుంటున్నావా అన్నది ఆయన చూస్తాడు
* కష్టాలను భరించగలగడమే మనిషి ఉన్నతుడిగా చేస్తుంది కేవలం బ్రతుకు వెళ్లబుచ్చడానికి శక్తివంతమైన నిండు బ్రతుకుకి తేడా ఇదే కష్టాలు వ్యక్తిత్వాన్ని పెంచుతాయి
* నిన్ను వెళ్ళమని ఆయన ఆదేశించే అనుభవాల్నన్నింటిలోకి ఆయన ముందుగానే వెళ్లి ఉన్నాడన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుని ధైర్యం తెచ్చుకోండి
* కష్టాల పర్వతాలను చూసి దిగులు పడతాము సనుగుకుంటాము కానీ ఈ పర్వాతాలే మనపై వర్షాలు కురువడానికి కారణం
* క్రీస్తు యొక్క పరిశుద్ధ ప్రేమనుండి నిన్ను ఎడబాపే మరి దేనినైనా వదిలించుకో
* నీ పాదం వెయ్యగల అడుగు కంటే ఒక్క అడుగు కూడా ఎక్కువ వేయించడాయన
* ఆందోళన ఎప్పుడు మొలకెత్తుతుందో విస్వాసం అప్పుడే వాడిపోతుంది నిజమైన విస్వాసం పుట్టడమే ఆందోళనకి స్వస్తి
* నీకు నీ శత్రువుకి మధ్య దేవుణ్ణి పెట్టు
* చావు ఎప్పుడో వచ్చే ఒక నీడ మాత్రమే ముందుగా కావాల్సింది ప్రస్తుతం మన విదుల్ని నిర్వర్తించాడానికి బ్రతకడానికి ధైర్యం. అది ఉంటే చావడానికి ధైర్యం కూడా దానంతట అదే వస్తుంది
* పూర్తిగా దేవునికి చెందిన వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైన సంతృప్తిగానే ఉంటారు ఎందుకంటే దేవుని చిత్తమే వాళ్ళ చిత్తం
* మారుమనస్సు పొందడానికి ఆయన కృపనిస్తే నిన్ను ఆదరించే కృపలను కూడా ఆయనే ఇస్తాడు
No comments:
Post a Comment