నోవహు
దేవుడు భూమ్యాకాశములను, సమస్త జీవరాసులను, మనుష్యులను సృష్టించాడు. నరులు భూమి మీద బాగా విస్తరించారు. దేవుని ప్రజలు (షేతు
సంతానము) అన్యుల కుమార్తెల (శపించబడిన కయీను సంతతి) అందచందాలకు ముగ్గులై, వారిని వివాహం చేసికొన్నారు. వారి వలన సంతానాన్ని
పొందారు. ఈ విధంగా దేవుని యెడల భయభక్తులు లేని జనాంగము భూమి పై విస్తరించింది. ప్రజలు అక్రమ కార్యాలు చేస్తున్నారు. వారి ఆలోచనలు చెడిపోయాయి యిదంతా చూసి దేవుడు చాల సంతాప పడ్డాడు. నేను భూమి పై సృజించిన నరులను, యితర జీవరాసులను పూర్తిగా నాశనం
చేస్తాను అనుకొన్నాడు.
నోవహు యెహోవా దృష్టిలో చాల దయపొందిన వాడు. అతడు నీతి
మంతుడు, నిందా రహితుడు మరియు దేవునితో నడచిన వాడు. దేవుడు నోవహును పిలిచి యిలా చెప్పాడు. “నేను మహా భయంకరమైన జల ప్రళయం
ద్వారా మానవ జాతిని, సృష్టిలోని జీవరాసులను నాశనం చేయబోతున్నాను.
అయితే నీవు నా దృష్టిలో నీతి మంతుడవుగా కనిపిస్తున్నావు. నేను చెప్పిన విధంగా నీవు ఒక పెద్ద ఓడను తయారు చెయ్యి, దానిలోనికి నీవు, నీ భార్య,
నీ ముగ్గురు కుమారులు, వారి భార్యలు ప్రవేశించండి. నీ వెంబడి భూమిపై వున్న అన్ని జంతువులు, పక్షులు మరియు ప్రాకెడి పురుగులన్నింటిని ఆడ,
మగ జంటలుగా ఓడలోనికి చేర్చండి. మీకు కావలసిన ఆహార పదార్థాలను సమకూర్చుకోండి. నేను జల ప్రళయం రప్పించినప్పుడు నీవు, నీ ఓడలో వున్న
ప్రాణులు మాత్రమే రక్షింపబడతారు” అని చెప్పాడు.
నోవహు దేవుని మాటలు విశ్వసించాడు. ఆయన చెప్పిన విధంగా చితిసారపు మానుతో ఒక పెద్ద ఓడను తయారు చేయడం మొదలు పెట్టాడు.
దాని పొడవు 30 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. నోవహు
ఓడను తయారు చేస్తుంటే చూసిన ప్రజలు నవ్వసాగారు. అతనికి పిచ్చి పట్టిందని
ఎగతాళి చేయసాగారు. అతను చెప్పే మాటలు ఎవరూ నమ్మడం లేదు. అయినా
వారి మాటలు లెక్క చేయకుండా నోవహు ఓడను తయారు చేశాడు.
జల ప్రళయం వచ్చిన సమయంలో నోవహు వయస్సు 600 సంIIలు అతనితోపాటు అతని భార్య, కొడుకులు, కోడళ్ళు మరియు జంటలుగా జంతువులు, పక్షులు, ప్రాకెడి పురుగులు, ఓడలో ప్రవేశించాయి. ఆ ఓడలో ప్రతి జాతికి చెందిన జంతువులు, పక్షులు ఉన్నాయి. రెండవ నెల 17 దినము ఆకాశపు తూములు తెరవబడ్డాయి. నలభైరోజులు ప్రచండమైన వరము కురిసింది. సముద్రాలు పొంగాయి. భూమిలోని నీటి ఊటలు పైకి వచ్చాయి. భూమి అంతా నీటితో నిండిపోయింది. ఓడ క్రమంగా నీటిపై తేలి ప్రయాణం చేయసాగింది. నీళ్ళు పది హేను మూరల ఎత్తు (23 అడుగులు) నిలిచాయి. పల్లెలు, పట్టణాలు, చెట్లు, గుట్టలు అన్నీ మునిగిపోయాయి. భూమి పై వున్న సమస్త జీవరాసులు మరణించాయి. భూమి మీద 150 రోజుల వరకు నీళ్ళు వ్యాపించి వున్నాయి. నోవహు, అతని ఓడలో వున్న ప్రాణులు మాత్రమే జీవించి
వున్నారు. ఏడవ నెల పదిహేడవ దినమున, 150 దినముల తర్వాత ఓడ అరారాతు కొండమీద నిలిచింది. నీళ్లు పదవ నెల వరకు నెమ్మదిగా తగ్గుతూ
వచ్చాయి. నోవహు ఓడ కిటికీని తెరచి బయటికి చూశాడు. వర్షం ఆగిపోయిందని గ్రహించాడు. అతడు ఒక కాకిని బయటికి వదిలాడు. అది తిరిగి రాలేదు.
తర్వాత ఒక నల్ల పావురాన్ని వదిలాడు. అది అటు యిటు తిరిగి భూమి యంతటి మీద నీరు వ్యాపించి వున్నందున ఓడలోనికి తిరిగి వచ్చింది. ఏడు
దినముల తర్వాత నోవహు మరల ఆ నల్లపావురాన్ని బయటికి పంపాడు.సాయంకాలము అది తిరిగి వచ్చింది. దాని నోటిలో ఒక ఒలీవ కొమ్మ ఆకు
వుంది. యింకా ఏడు దినాలు ఆగి అదే పావురాన్ని వదిలాడు. ఆ పావురం తిరిగి రాలేదు. అందువల్ల భూమి పై నీళ్పు పూర్తిగా తగ్గిపోయాయని నోవహు
గ్రహించాడు. దేవుని ఆజ్ఞ అనుసరించి నోవహు, అతని కుటుంబ సభ్యులు ఓడలో నుండి బయటికి వచ్చారు. ఓడలో వున్న ప్రాణులు కూడ, వారిలో పాటు భూమి పైకి వచ్చాయి. అప్పుడు దేవుడు నోవహుతో యిలా అన్నాడు. “నేను నిన్ను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. మీరు బాగా ఫలిస్తారు. భూమండలం అంతా వ్యాపిస్తారు.
మీరు భూమి పై వున్న పంటలన్నీ తినవచ్చు. చేపలను, జంతువులను, పక్షులను తినవచ్చు. అయితే రక్తము ప్రాణం కనుక రక్తంతో మాత్రం తినకూడదు. నోవహు యొక్క ముగ్గురు కుమారుల పేర్లు మేము, హోము, యా పెతు.
దేవుడు నోవహుతో అతని కుమారులతో ఒక నిబంధన చేశాడు. “ఇక పై నేను నీటి ద్వారా మానవ జాతిని, సృష్టిని నాశనం చేయను. జనులు జల ప్రళయం ద్వారా నాశనం చేయబడరు. మీకు, నాకు మధ్య ఏర్పరచుకొన్న ఈ నిబంధనకు గుర్తుగా మేఘంలో నా ఇంద్రధనుస్సు వుంచుతున్నాను. నేను దానిని చేసి భూమి పై వున్న సమస్త జీవరాసులకు నేను చేసిన నిబంధన జ్ఞాపకం చేసికొంటాను”
షేము, హాము, యా పెతు అనువారి సంతానం భూమియందంతట వ్యాపించింది. నోవహు వ్యవసాయం చేసి ద్రాక్షతోటలు వేశాడు. జల ప్రళయం అయిపోయిన తరువాత నోవహు 350 సం||లు జీవించాడు. మొత్తము 950 ఏండ్లు బ్రతికి, తర్వాత మరణించాడు.
ధ్యానాంశములు :
నోవహు విశ్వాసికి సూచనగా వున్నాడు. దేవుని మాటలు విశ్వసించినందున అతడు, అతని యింటివారు రక్షింపబడ్డారు.ఓడ యేసు క్రీస్తుకు సాదృశ్యంగా వున్నది. ఓడలో వున్న మనుషులు,
యితర ప్రాణులు మరణం తప్పించుకొన్నారు. కాగా, యిప్పుడు క్రీస్తుయేసు నందున్న వారికి ఏ శిక్ష విధియులేదు - అను వాక్యము ధ్యానించదగినది.జల ప్రళయంలోని పెనుగాలులు, వర్షము, పెద్ద అలలు అన్నీ ఓడను చాల యిబ్బంది పెట్టాయి. ఓడలో వున్నవారు మాత్రం భద్రంగా, నిశ్చింతగా వున్నారు. అలాగే యేసుక్రీస్తు కూడ మనందరి కొరకు శ్రమలు, అవమానాలు సహించి మనకు రక్షణ భాగ్యాన్ని యిచ్చాడు.
నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన వ్యసన
ములను వహించెను యెష 53:4
No comments:
Post a Comment