Breaking

Wednesday, 6 March 2024

yesayyaa naa hrudaya spandana song lyrics | యేసయ్యా నా హృదయ స్పందన

 




yesayyaa naa hrudaya spandana song lyrics : 


యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2)

విశ్వమంతా నీ నామము ఘణనీయము (2) ||యేసయ్యా||


నీవు కనిపించని రోజున

ఒక క్షణమొక యుగముగా మారెనే (2)

నీవు నడిపించిన రోజున

యుగయుగాల తలపు మది నిండెనే (2)

యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా||


నీవు మాట్లాడని రోజున

నా కనులకు నిద్దుర కరువాయెనే (2)

నీవు పెదవిప్పిన రోజున

నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2)

నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా||


నీవు వరునిగా విచ్చేయి వేళ

నా తలపుల పంట పండునే (2)

వధువునై నేను నిను చేరగా

యుగయుగాలు నన్నేలు కొందువనే (2)

యుగయుగాలు నన్నేలు కొందువనే ||యేసయ్యా||



No comments:

Post a Comment