పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు
బలవంతుడు బలమిచ్చును - ప్రభువుల ప్రభువు క్రీస్తు ||పరి||
1. గాఢాంధకారపు లోయలలో - నేను సంచరించిననూ
అగాధ జల ప్రవాహములో - నేను సాగవలసినూ ॥2॥
ఎన్నటికి భయపడను - నీవు తోడుండగా
ఎన్నటికి వెనుదిరుగను నాయందు నీవుండగా ||పరి||
2. నశించు ఆత్మల రక్షణకై - నే ప్రయాస పడుదును
కష్టములెన్నొచ్చినా - కృంగి పోకుందును ॥2॥
ఎన్నటికీ వెనుదిరుగను అండ నీవుండగా
ఎన్నటికీ ఓడిపోను జయశాలి నీవుండగా ||పరి||
No comments:
Post a Comment