నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని
ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి
ఇది నా చివరి ఇది నా కడవరి
మిగిలియున్న నిరీక్షణా... మిగిలియున్న నిరీక్షణా...
1. పాపపు ఊబిలో పాతుకుపోయిన
పాపపు తీగెలో అల్లుకుపోయిన ॥2॥
పాత రోత జీవితాన్ని ॥ 2॥
పవిత్ర పరచుము పరిశుద్ధుడా
పవిత్ర పరచుము పరమాత్ముడా ||నీ||
2.చితికిన బ్రతుకు చీదరి తనువు
చిక్కులలోనా చిక్కిన నన్ను ॥2॥
చేరదీసి సేదదీర్చుము ॥2॥
చేతనైనా పరిశుద్ధుడా - చేతనైనా పరమాత్ముడా ||నీ||
Nee matalatho na brathukunu song lyrics
No comments:
Post a Comment