నీ స్తుతి పాత్రనై పాడెద - వేనోళ్ళతో యేసయ్య
నీ స్తుతియాగమే చేసెద - నీ సముఖాన నా యేసయ్య
నిన్నెంత ఘనపరచిన - నిన్నెంత నే పొగడిన
నా తనివి తీరదే - నీ ఋణము తీరదే
నీ ఆరాధనే నా ఆనందము-
నీ సంకీర్తనే నా సంతోషము ॥నీ స్తుతి॥
1. లోపములున్నను నను ప్రేమించి
లోకమునుండి నను వేరుపరచి
లోబడుట నాకు నేర్పించితివి
లోతునకు నను నడిపించితివి ॥నీ ఆరాధనే॥
2. నీ చిత్తమునే జరిగించుటకు
నీ మహిమను నే వివరించుటకు
నీ సన్నిదిలో - నను నిలిపితివి
నీ సేవ చేసే - ధన్యత నిచ్చితివి ॥నీ ఆరాధనే॥
No comments:
Post a Comment