క్రిస్మస్ క్రీస్తు జన్మదినం - క్రిస్మస్ మేరి పుణ్యదినం
క్రిస్మస్ మనకు పర్వదినం - క్రిస్మస్ లోకానికి శుభదినం
హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ
తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మా... ఓ మరియమ్మా
చుక్కాను జూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు
1. దేవుడే దీనుడై దిగి వచ్చినా దినం
ప్రభువే పశుపాకలో పుట్టినా దినం
దూతలే పాటలు పాడినా దినం
జ్ఞానులే ఆరాధించినా దినం ॥ హల్లెలూయా ॥
2. గొల్లలే పరవశించిపోయినా దినం
రాజులే భయభ్రాంతులైన దినం
శాస్త్రులే సత్యాన్ని గ్రహించినా దినం
లోకమే పరవళ్ళు తొక్కిన దినం ॥ హల్లెలూయా ॥
No comments:
Post a Comment