Sarirarevvaru naa priyudaina song lyrics :
సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి
సరిహద్దులు లేని పరిశుద్ధునికి -2
సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2
1.నమ్మదగిన వాడే నలుదిశల
నెమ్మది కలుగజేయువాడే -2
నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే
నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే -2
2.ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే -2
ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే
నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే -2
3.పునరుత్థానుడే జయశీలి
మృతిని జయించి లేచినాడే -2
శ్రేష్ఠమైన పునరుత్థాన బలము యిచ్చినాడే
నాకై అతిత్వరలో మహిమతో రానైయున్నావాడే -2
No comments:
Post a Comment