యేసువా.. యేసువా..
యేసువా నా యేసువా (2)
మీ జ్ఞాపకార్థముగా భుజించుచున్నాము
మీ దివ్య దేహమును
తమ ఆజ్ఞానుసారముగా పానము చేసెదము
మీ తీరు రుధిరమును (యేసువా)
1.ఆనాడు మీ దేహమును హింసించి చంపితిమి (2)
ఈనాడు ఆ దేహమే మేము గాచుచుండెనుగా (2)
మేము గాచుచుండెనుగా (యేసువా)
2.ఆనాడు మీ రక్తమును చిందింప చేసితిమి (2)
ఈనాడు ఆ రక్తమే మేము శుద్ధి పరచెనుగా (2)
మేము శుద్ధి పరచెనుగా (యేసువా)
3.మా పాప భారమును సిలువగ మోసితివి (2)
మార్గము చూపితివి రక్షణ నొసగితివి (2)
రక్షణ నొసగితివి (యేసువా)
No comments:
Post a Comment