Breaking

Tuesday, 4 April 2023

Evari kosamo ee prana thyagam song lyrics |ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము




ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము (2)

నీ కోసమే నా కోసమే

కలువరి పయనం – ఈ కలువరి పయనం (2) (ఎవరి)


1.ఏ పాపము ఎరుగని నీకు

ఈ పాప లోకమే సిలువ వేసిందా

ఏ నేరము తెలియని నీకు

అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2)

మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో

నడువలేని నడకలతో తడబడుతూ పోయావా

సోలి వాలి పోయావా….          (ఎవరి)


2.జీవకిరీటం మాకు ఇచ్చావు

ముళ్ళ కిరీటం నీకు పెట్టాము

జీవ జలములు మాకు ఇచ్చావు

చేదు చిరకను నీకు ఇచ్చాము (2)

మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా

నీ ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటు పొడిచితిమి

తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు

వీరిని క్షమించు, వీరిని క్షమించు

అని వేడుకొన్నావా… పరమ తండ్రిని  (ఎవరి)





No comments:

Post a Comment