Breaking

Friday, 14 April 2023

Vendi bangaramulu song lyrics | వెండి బంగారములు

వెండి బంగారములు నాకు వలదు

పేరు ప్రఖ్యాతులు నాకు వలదు (2)

ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు (2)

సిరి సంపదల ఆశ నాకు లేదు (2)

నీ పాద సన్నిదె నాకు చాలు (2)

స్తుతి నీకే నా ప్రభు స్తుతి నీకే నా ప్రభు

స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసుప్రభు (2)

స్తుతి నీకే నా ప్రభు స్తుతి నీకే నా ప్రభు

కమ్మని విందులు నాకువలదు

క్షనిక ఆనందాలు నాకు వలదు (2)

కీర్తి కిరీటాలు నాకు వలదు (2)

కళల సంచారాలు నాకు వలదు (2)

నీ దివ్య కౌగిలే నాకు చాలు (2)

స్తుతి నీకే నా ప్రభు స్తుతి నీకే నా ప్రభు

స్థితి ఘనత మహిమలన్ని నీకే ఏసుప్రభు (2)

స్తుతి నీకే నా ప్రభు సుత్తి నీకే నా ప్రభు

బంధు బాంధవ్యాల బాధ వలదు

బరువు బాధ్యతలన్న భయము వలదు (2)

నీ మధుర బంధమే నాకు చాలు (2)

నివిచ్చు భాగ్యమే నాకు మేలు

నువ్వు మెచ్చు కార్యమే నాకు చాలు (2)

స్తుతి నీకే నా ప్రభు స్తుతి నీకే నా ప్రభు

స్తుతి ఘనత మహిమలన్నీ ఏసుప్రభు (2)

స్తుతి నీకే నా ప్రభు స్తుతి నీకే నా ప్రభు 

No comments:

Post a Comment