Breaking

Thursday, 20 April 2023

Nuthanamainadi Nee Vaathsalyamu - నూతనమైనది నీ వాత్సల్యము


Click on image 



నూతనమైనది నీ వాత్సల్యము – ప్రతి దినము నన్ను దర్శించెను
ఎడబాయనిది నీ కనికరము – నన్నెంతో ప్రేమించెను
తరములు మారుచున్నను – దినములు గడచుచున్నను
నీ ప్రేమలో మార్పు లేదు (2)
సన్నుతించెదను నా యేసయ్యా
సన్నుతించెదను నీ నామము (2)

------------------------------------------------------------------

1.గడచిన కాలమంతా – నీ కృప చూపి – ఆదరించినావు
జరగబోయే కాలమంతా – నీ కృపలోన – నన్ను దాచెదవు (2)
విడువని దేవుడవు – ఎడబాయలేదు నన్ను
క్షణమైనా త్రోసివేయవు (2)         ||సన్నుతించెదను||

------------------------------------------------------------------

2.నా హీన దశలో – నీ ప్రేమ చూపి – పైకి లేపినావు
ఉన్నత స్థలములో – నను నిలువబెట్టి – ధైర్యపరచినావు (2)
మరువని దేవుడవు – నను మరువలేదు నీవు
ఏ సమయమైననూ చేయి విడువవు (2)         ||సన్నుతించెదను||
------------------------------------------------------------------

3.నీ రెక్కల క్రింద – నను దాచినావు – ఆశ్రయమైనావు
నా దాగు స్థలముగా – నీవుండినావు – సంరక్షించావు (2)
ప్రేమించే దేవుడవు – తృప్తి పరచినావు నన్ను
సమయోచితముగా ఆదరించినావు (2)         ||సన్నుతించెదను||

--------------------------------------------------------



No comments:

Post a Comment