Breaking

Thursday, 20 April 2023

Akshama alakinchuma song lyrics | ఆకాశమా ఆలకించుమా

 


Akshama alakinchuma song lyrics in telugu :


ఆకాశమా ఆలకించుమా భూమీ చెవియొగ్గుమా (2)

అని దేవుడు మాటలడుచున్నాడు

తన వేదన నీతో చెబుతున్నాడు (2)    ||ఆకాశమా||


నేను పెంచిన నా పిల్లలే

నా మీదనే తిరగబడిరనీ (2)

అరచేతిలో చెక్కుకున్నవారే

నా అరచేతిపై మేకులు కొడుతూ (2)

నను దూరంగా ఉంచారని

నా పిల్లలు బహు చెడిపోతున్నారని (2)    ||దేవుడు||


విస్తారమైన బలులు నాకేల

క్రొవ్విన దూడా నాకు వెక్కసమాయే (2)

కోడెల రక్తం గొర్రె పిల్లల రక్తం

మేకల రక్తం నాకిష్టము లేదు (2)

కీడు చేయ మానాలని

బహు మేలు చేయ నేర్వాలని (2)           ||దేవుడు||


పాపిష్టి జనమా, దుష్టసంతానమా

చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ


అక్కరలో మీ చేతులు నా వైపుకు చాచినపుడు

మిమ్మును నే చూడకనే కనులు కప్పుకొందును

ఆపదలో మీ గొంతులు నా సన్నిధి అరచినపుడు

మీ మాటలు వినకుండా చెవులు మూసుకొందును

నన్ను విసర్జించువారు లయమగుదురని

నీరులేని తోటలా నశియింతురని (2)        ||దేవుడు||


ఆకాశమా భువికి చెప్పుమా భూమీ లోకాన చాటుమా (2)





No comments:

Post a Comment