Breaking

Thursday, 12 January 2023

Yesayyaa Ninnu Choodaalani song lyrics | యేసయ్యా నిన్ను చూడాలని ఆశ


 



Yesayyaa Ninnu Choodaalani song lyrics : 


యేసయ్యా నిన్ను చూడాలని ఆశ

మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ (2)

ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో

ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు

ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా (2)         ||యేసయ్యా||


1.అందరు ఉన్నారని అందరు నావారని (2)

తలచితిని భ్రమచితిని చివరికి ఒంటరి నేనైతిని (2)

చివరికి ఒంటరి నేనైతిని

నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా

నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా        ||యేసయ్యా||


2.అంధకారములో అంధుడ నేనైతిని (2)

నిను చూచే నేత్రములు నాకొసగుమా నజరేయుడా (2)

నాకొసగుమా నజరేయుడా

నా ఆశ నీవయ్యా నా ధ్యాస నీవయ్యా

నా భాష నీవయ్యా నా శ్వాస నీవయ్యా        ||యేసయ్యా||












No comments:

Post a Comment