Breaking

Sunday, 13 November 2022

Paapaaniki Naaku Ae Sambandham Ledu | పాపానికి నాకు



Paapaaniki Naaku Ae Sambandham Ledu song lyrics : 


పాపానికి నాకు ఏ సంబంధం లేదు

పాపానికి నాపై ఏ అధికారము లేదు

పాపానికి నాకు ఏ సంబంధం లేదు

పాపానికి నాపై ఏ అజమాయిషీ లేదు

నా పాపములు అన్ని – నా ప్రభువు ఏనాడో క్షమియించివేసాడుగా

మరి వాటినెన్నడును – జ్ఞాపకము చేసికొనెను

అని మాట ఇచ్చాడుగా

నేనున్నా నేనున్నా – నా యేసుని కృప క్రింద

నే లేను నే లేను – ధర్మశాస్త్రం క్రింద (2)           ||పాపానికి||


1.కృప ఉందని పాపం చెయ్యొచ్చా – అట్లనరాదు

కృప ఉందని నీతిని విడువోచ్చా (అట్లనరాదు)

కృప అంటే లైసెన్స్ కాదు

కృప అంటే ఫ్రీ పాస్ కాదు – పాపాన్ని చేసేందుకు

కృప అంటే దేవుని శక్తి

కృప అంటే దేవుని నీతి – పాపాన్ని గెలిచేందుకు


గ్రేస్ ఈస్ నాట్ ఎ లైసెన్స్ టు సిన్

ఇట్స్ ఎ పవర్ ఆఫ్ గాడ్ టు ఓవర్ కం (4)               ||నేనున్నా||


2.కృప ద్వారా ధర్మశాస్త్రముకు – మృతుడను అయ్యా

కృప వలన క్రీస్తులో స్వాతంత్య్రం (నే పొందితినయ్యా)

క్రియల మూలముగా కాదు

కృపయే నను రక్షించినది – నా భారం తొలగించినది

కృప నన్ను మార్చేసినది

నీతి సద్భక్తుల తోడ – బ్రతుకమని బోధించినది


గ్రేస్ టుక్ అవే బర్డెన్ ఫ్రమ్ మి

అండ్ టాట్ మి టు లివ్ రైటియస్లీ (4)               ||నేనున్నా||


3.పాపానికి మృతుడను నేనయ్యా – హల్లెలూయా

కృప వలనే ఇది నాకు సాధ్యం (అయ్యిందిరా భయ్యా) (2)

కృపను రుచి చూచిన నేను

దేవునికే లోబడుతాను – పాపానికి చోటివ్వను

పరిశుద్ధత పొందిన నేను

నీతి సాధనములుగానే – దేహం ప్రభుకర్పింతును


యీల్డ్ యువర్ బాడీస్ అంటు ద లార్డ్

యాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైటియస్నెస్ (4)               ||నేనున్నా||


4.ధర్మశాస్త్రం పాపం అయ్యిందా – అట్లనరాదు

ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా (అట్లనరాదు) (2)

ధర్మశాస్త్రం కొంత కాలమేగా

ధర్మశాస్త్రం బాలశిక్షయేగా – ప్రభునొద్దకు నడిపేందుకు

క్రీస్తొచ్చి కృప తెచ్చెనుగా

ధర్మశాస్త్రం నెరవేర్చెనుగా – మనలను విడిపించేందుకు


లా హాస్ లెడ్ పీపుల్ టు క్రైస్ట్

నౌ గ్రేస్ విల్ మేక్ అస్ కాంకరర్స్ (4)               ||నేనున్నా||





No comments:

Post a Comment