Breaking

Monday, 19 September 2022

Nannu Gannayya Raave | దవలవర్ణుడా రత్నవర్ణుడా


 

నన్ను గన్నయ్య రావె నా యేసు

నన్ను గన్నయ్య రావె నా ప్రభువా        ||నన్ను||


1.ముందు నీ పాదారవిందము

లందు నిశ్చల భక్తి ప్రేమను (2)

పొందికగా జేయరావే నా

డెందమానంద మనంతమైయుప్పొంగ       ||నన్ను||


2.హద్దులేనట్టి దురాశల

నవివేకినై కూడి యాడితి (2)

మొద్దులతో నింక కూటమి

వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి       ||నన్ను||


3.కాలము పెక్కు గతించెను

గర్వాదు లెడదెగవాయెను (2)

ఈ లోకమాయ సుఖేచ్ఛలు

చాలును జాలును జాలు నోతండ్రి       ||నన్ను||


4.దారుణ సంసార వారధి

దరి జూపి ప్రోవ నీ కన్నను (2)

కారణ గురువు లింకెవ్వరు

లేరయ్య – లేరయ్య లేరయ్య తండ్రి       ||నన్ను||


5.నా వంటి దుష్కర్మ జీవిని

కేవలమగు నీదు పేర్మిని (2)

దీవించి రక్షింపనిప్పుడే

రావయ్య రావయ్య రావయ్య తండ్రి       ||నన్ను||





No comments:

Post a Comment