Breaking

Monday, 19 September 2022

Nannu Diddumu Chinna Praayamu | నన్ను దిద్దుము


 


నన్ను దిద్దుము చిన్న ప్రాయము – సన్నుతుండగు నాయనా

నీవు కన్న తండ్రి వనుచు నేను – నిన్ను చేరితి నాయనా            ||నన్ను||


1.దూరమునకు బోయి నీ దరి – జేర నైతిని నాయనా

నేను కారు మూర్ఖపు పిల్లనై కా – రడవి దిరిగితి నాయనా            ||నన్ను||


2.మంచి మార్గము లేదు నాలో – మరణ పాత్రుండ నాయనా

నేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా                   ||నన్ను||


3.చాల మారులు తప్పిపోతిని – మేలు గానక నాయనా

నా చాల మొరల నాలకించుము – జాలిగల నా నాయనా            ||నన్ను||


4.జ్ఞాన మంతయు బాడుచేసి- కాన నైతిని నాయనా

నీవు జ్ఞానము గల తండ్రి మంచు – జ్ఞప్తి వచ్చెను నాయనా            ||నన్ను||


5.కొద్ది నరుడను దిద్ది నను నీ – యొద్ద జేర్చుము నాయనా

నీ యొద్ద జేర్చి బుద్ధి చెప్పుము – మొద్దు నైతిని నాయనా                ||నన్ను||


6.ఎక్కడను నీవంటి మార్గము – నెరుగ నైతిని నాయనా

నీ రెక్క చాటున నన్ను జేర్చి – చక్కపరచుము నాయనా            ||నన్ను||


7.శత్రువగు సాతాను నన్ను – మిత్రు జేయను నాయనా

యెన్నో సూత్రములు గల్పించెను నా – నేత్రముల కో నాయనా     ||నన్ను||


8.వాసిగా నే బాప లోకపు – వాసుడ నో నాయనా

నీ దాసులలో నొకనిగా నను జెసి కావుము నాయనా                 ||నన్ను||




No comments:

Post a Comment