Kraisthavudaa Sainikudaa song lyrics :
క్రైస్తవుడా సైనికుడా
బలవంతుడా పరిశుద్ధుడా
కదలిరావోయ్ నీవు కదలిరా (4)
1.జాలరీ మనుషులు పట్టు జాలరి
ఆత్మలు పట్టు కాపరి
అమృతమందించే ఆచారి
యేసుకై జీవించే పూజారి ||క్రైస్తవుడా||
2.సిలువే నీ స్థావరము
శ్రమలే నీ సైన్యము (2)
సహనమే నీ ధైర్యము
వాక్యమే నీ విజయము (2) ||క్రైస్తవుడా||
3.సత్యమే నీ గమ్యము
సమర్పణే నీ శీలము (2)
యేసే నీ కార్యక్రమం
ప్రేమే నీ పరాక్రమం (2) ||క్రైస్తవుడా||
4.దేశంలో విదేశంలో
గ్రామంలో కుగ్రామంలో (2)
అడవులలో కొండలలో
పని ఎంతో ఫలమెంతో (2) ||క్రైస్తవుడా||
5.సిద్ధాంతపు గట్టు దుమికి రా
వాగులనే మెట్టును దిగిరా (2)
దీనుడా ధన్యుడా
విజేయుడా అజేయుడా (2) ||క్రైస్తవుడా||
6.వాగ్ధాన భూమి స్వతంత్రించుకో
అద్వానపు అడవి దాటి ముందుకుపో (2)
నీ ఇల్లు పెనూయేలు
నీ పేరే ఇశ్రాయేలు (2) ||క్రైస్తవుడా||
No comments:
Post a Comment