Breaking

Thursday, 2 June 2022

Tharachi Tharachi song lyrics - తరచి తరచి చూడ తరమా


 

Tharachi Tharachi song lyrics :


తరచి తరచి చూడ తరమా

వెదకి వెదకి కనుగొనగలమా

యేసు వంటి మిత్రుని లోకమందున

విడచి విడచి ఉండగలమా

మరచి మరచి ఇలా మనగలమా

యేసు వంటి స్నేహితుని విశ్వమందున


1.లోక బంధాలన్నీ తృప్తినివ్వలేవుగా

ఏ మనిషిని నమ్మాలో – తెలియదు ఈ లోకంలో

నేల మంటిలోన పరమార్ధం లేదుగా

ఎంత బ్రతుకు బ్రతికినా – చివరకు చితియేగా

నమ్మదగిన యేసు ప్రాణమిచ్చె నీకై

జగతిలోన దొరకునా ఇటువంటి ప్రాణప్రియుడు (2)  


2.లేరు లేరు ఎవ్వరు కానరారు ఎవ్వరు

యేసు వంటి ప్రేమికుడు ఇహమందు పరమందు

పదివేలలోన అతి కాంక్షణీయుడు

కలతలన్ని తీర్చి కన్నీటిని తుడచును

కల్వరిగిరిలోన కార్చెను రుధిరం

హృదయమందు చేర్చుకో కృప చూపు నాథుని (2)   











No comments:

Post a Comment