Breaking

Thursday, 9 June 2022

halleluya ani paadi song lyrics | హల్లెలూయ యని పాడి



 

halleluya ani paadi song lyrics : 


హల్లెలూయ యని పాడి స్తుతింపను 

రారె జనులారా మనసారా ఊరూర

హల్లెలూయ యని పాడి స్తుతింపను 

రారే జనులార ఊరూర నొరార


1.పాడి పంటలనిచ్చు - పాలించు దేవుడని (2)

కూడు గుడ్డల నిచ్చు పోషించు దేవుడని (2)

తోడు నీడగ నిన్ను - కాపాడు నాదుడని (2)

పూజించి - పూజించి - పాటించి చాటింపరారే  


2.తాత ముత్తాతలకన్న - ముందున్న దేవుడని (2)

తల్లి దండ్రులకన్న ప్రేమించు దేవుడని (2)

కల్లాకపటములేని - కరుణ సంపన్నుడని (2)

పూజించి - పూజించి - పాటించి - చాటించ రారె


3.రాజాధి రాజుల కన్న రాజైన దేవుడని (2)

నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని (2)

 నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని (2)

పూజించి - పూజించి - పాటించి - చాటించ రారె




No comments:

Post a Comment