Breaking

Monday, 11 April 2022

Priya Yesu Dehamulo song lyrics | ప్రియ యేసు దేహములో




Priya Yesu Dehamulo song lyrics: 


ప్రియ యేసు దేహములో ఉబికే రక్తపు ఊట
ప్రవహించె ఏరులై కలుషంబులను కడుగా

1.కొరడాల దెబ్బలచే – దేహము చారలై చీలగా
సుందరుండు వికారుడాయే – చూడనొల్లని వాడాయే     

2.నా దుష్ట తలంపులకై – ముండ్ల కిరీటమా తలపై
నా నీచ నడతలకై – పాద హస్తములలో చీలలా  

3.ముఖముపై గ్రుద్దిననూ – చెంపలపై కొట్టిననూ
బల్లెము ప్రక్కలో దింపినా – నీచునికి నిత్య జీవమా  

4.ఇది ఎంతటి ప్రేమ ప్రభు – ఏమని వర్ణింతు నిన్ను
సజీవ యాగముగా – నన్నే నీ-కర్పింతును







No comments:

Post a Comment