Breaking

Thursday, 10 March 2022

స్తోత్రబలి అర్పించెదము | Sthothrabali Arpinchedhamu

 

Sthothrabali Arpinchedhamu 


Sthothrabali Arpinchedhamu song lyrics :


స్తోత్రబలి అర్పించెదము

మంచి యేసు మేలు చేసెన్ (2)

చేసెను మేలులెన్నో

పాడి పాడి పొగడెదన్ (2)

తండ్రీ స్తోత్రం – దేవా స్తోత్రం (2)


1.ప్రాణమిచ్చి నను ప్రేమించి

పాపం తొలగించి కడిగితివే (2)

నీ కొరకు బ్రతుక వేరుపరచి

సేవ చేయ కృప ఇచ్చితివే (2)          ||తండ్రీ||


2.గొప్ప స్వరముతో మొరపెట్టి

సిలువ రక్తమును కార్చితివే (2)

రక్త కోటలో కాచుకొని

శత్రు రాకుండ కాచితివే (2)           ||తండ్రీ||


3.చూచే కన్నులు ఇచ్చితివి

పాడే పెదవులు ఇచ్చితివి (2)

కష్టించే చేతులు ఇచ్చితివి

పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి (2)         ||తండ్రీ||


4.మంచి ఇల్లును ఇచ్చావయ్యా

వసతులన్నియు ఇచ్చావయ్యా (2)

కష్టించి పనిచేయ కృప చూపి

అప్పు లేకుండ చేసితివే (2)           ||తండ్రీ||















No comments:

Post a Comment