Breaking

Saturday, 5 March 2022

అపొస్తలుల కార్యాలు పరిచయం

 




పేరు:

ఈ పుస్తకానికి “అపొస్తలుల కార్యాలు” అనే పేరు లూకా పెట్టినది కాదు. ఈ పేరు ఇతరులెవరో తర్వాత పెట్టారు. ఈ పేరు కంటే “పవిత్రాత్మ చర్యలు” లేదా “క్రీస్తు జరిగించే మరిన్ని పనులు” లేదా “క్రీస్తు రాయబారుల చర్యలు” అంటే బాగుంటుందనిపిస్తుంది.


రచయిత:

లూకా. లూకా శుభవార్త పరిచయం చూడండి. అపొ కా 1:1ను లూకా 1:1 తో పోల్చి చూడండి.


వ్రాసిన కాలం:

బహుశా క్రీస్తు శకం 60-63 మధ్యలో.


ముఖ్యాంశం:

క్రీస్తు సంఘం ఆరంభ చరిత్ర. క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తరువాత మొదటి 30 సంవత్సరాలలో వ్యాపించిన క్రీస్తు శుభవార్త. క్రీస్తు ఆరోహణుడైన తరువాత భూమిమీద జరిగిన ఆయన పని. ముఖ్య వచనం 1:8.


విషయసూచిక

యేసు చనిపోయి తిరిగి లేచిన తరువాత 40 రోజుల పాటు

తన శిష్యులతో గడిపి పరలోకానికి ఆరోహణుడు అయ్యాడు 1:1-11

శిష్యులు యూదా స్థానంలో ఇంకొకరిని ఎన్నుకొన్నారు 1:12-26

పవిత్రాత్మ దిగి వచ్చాడు 2:1-13

పెంతెకొస్తు రోజున పేతురు సందేశం 2:14-41

మొదటి సంఘం 2:42-47

దేవాలయం దగ్గర పేతురు కుంటివాణ్ణి బాగుచేశాడు 3:1-10

దేవాలయం దగ్గర పేతురు సందేశం 3:11-26

యూదుల అధికారుల సమక్షంలో పేతురు, యోహాను 4:1-22

శిష్యుల ప్రార్థన 4:23-31

మొదటి సంఘం ఐక్యత 4:32-37

అననీయా, సప్పీరాల పాపం 5:1-11

క్రీస్తు రాయబారుల అద్భుతాలు 5:12-16

యూదుల అధికారులు క్రీస్తు రాయబారులను హింసించారు 5:17-42

క్రీస్తు రాయబారులు ఏడుగురు పెద్దలను ఎన్నుకొన్నారు 6:1-7

స్తెఫను మీద నేరం 6:8-15

యూదుల అధికారులకు స్తెఫను సందేశం 7:1-53

స్తెఫను మరణం 7:54-60

సంఘానికి హింసలు 8:1-3

సమరయలో ఫిలిప్పు 8:4-13

సమరయలో పేతురు, యోహాను 8:14-25

ఫిలిప్పు, ఇతియోపియా దేశస్థుడు 8:26-40

దమస్కు మార్గంలో సౌలు 9:1-9

సౌలు, అననీయ 9:10-19

సౌలు శుభవార్తను ప్రకటించాడు 9:20-30

పేతురు ఐనెయస్‌ను బాగుచేసి, దొర్కస్‌ను బ్రతికించాడు 9:32-43

కొర్నేలి 10:1-8

దేవుడు పేతురుకు దర్శనం ఇచ్చాడు 10:9-23

పేతురు కొర్నేలి ఇంటిలో 10:24-28

కొర్నేలి ఇంటిలో ఏమి జరిగిందో పేతురు ఇతర విశ్వాసులకు చెప్పాడు 11:1-18

అంతియొకయలో క్రీస్తు సంఘం 11:19-30

యాకోబు మరణం, పేతురు బంధించబడడం 12:1-3

దేవదూత పేతురును విడిపించాడు 12:4-19

హేరోదురాజు మరణం 12:20-25

పౌలు బర్నబాసుల ప్రయాణం 13:1—14:28

సైప్రస్ దీవిలో 13:4-12

పిసిదియలోని అంతియొకయలో 13:13-52

ఈకొనియలో 14:1-7

లుస్త్ర, దెర్బేలలో 14:8-21

జెరుసలంలో సంఘ ఆలోచన సభ 15:1-35

తప్పుడు సిద్ధాంతం 15:1-5

సంఘ నిర్ణయం 15:6-23

యూదేతరులైన విశ్వాసులకు లేఖ 15:24-35

పౌలు, బర్నబా విడిపోయారు 15:36-41

పౌలు రెండవ శుభవార్త ప్రయాణం 16:1—18:22

లుస్త్ర దెర్బేలలో 16:1-3

త్రోయలో 16:6-10

ఫిలిప్పీలో 16:11-40

చెరసాల అధికారి పశ్చాత్తాపం 16:25-34

తెస్సలోనీకలో 17:1-9

బెరియలో 17:10-15

ఏథెన్సులో 17:16-34

కొరింతులో 18:1-17

ఎఫెసులో 18:18-22

పౌలు మూడవ శుభవార్త ప్రయాణం 18:23—21:17

గలతీయ, ఫ్రుగియలలో 18:23

ఎఫెసులో 19:1-41

మాసిదోనియా, గ్రీసులలో 20:1-5

త్రోయలో 20:6-12

ఎఫెసు పెద్దలకు పౌలు వీడ్కోలు 20:17-38

జెరుసలంకు ప్రయాణం 21:1-17

జెరుసలంలో యాకోబుతో పౌలు 21:18-26

పౌలు బందీ అయ్యాడు 21:27-36

పౌలు యూదుల సమూహంతో మాట్లాడాడు 21:37—22:21

బందీ అయిన రోమ్ పౌరుడు పౌలు 22:22-29

యూదుల అధికారుల సమక్షంలో పౌలు 22:30—23:11

పౌలును చంపడానికి యూదుల ఆలోచన 23:12-22

రోమ్ వారు పౌలును సీజరియకు తీసుకుపోయారు 23:23-35

అధికారి ఫేలిక్స్ సమక్షంలో పౌలు 24:1-27

అధికారి ఫేస్తస్ సమక్షంలో పౌలు 25:1-12

అగ్రిప్పరాజు సమక్షంలో పౌలు 25:23—26:32

పౌలు రోమ్ ప్రయాణం 27:1—28:16

తుఫాను, ఓడ పగిలిపోయింది 27:13-44

మాల్త ద్వీపంలో 28:1-10

రోమ్‌లో పౌలు 28:16-31

No comments:

Post a Comment