రచయిత:
ప్రభువైన యేసు క్రీస్తు రాయబారి అయిన పేతురు.
వ్రాసిన కాలం:
క్రీ.శ. 65-67 మధ్య కాలంలో.
ముఖ్యాంశం:
పేతురు యూదులకు క్రీస్తు రాయబారి (గలతీ 2:8-9), గనుక యూద క్రైస్తవులకు రాస్తున్నాడు (1:1). అయినా దైవావేశం వల్ల కలిగిన ఈ దివ్య సత్యాలు అన్ని కాలాలలో విశ్వాసులందరికోసమూ రాసి ఉన్నాయి. యేసుప్రభువు లూకా 22:31-32లో పేతురుకు ఇచ్చిన ఆదేశం ఈ లేఖలో అద్భుతంగా నెరవేరింది. ఈ లేఖ ద్వారా లెక్కలేనంతమంది క్రైస్తవులకు విశ్వాసంలో ఆధ్యాత్మిక బలం కలిగింది. ఈ లేఖలో కొన్ని ముఖ్యమైన మాటలు “ఆశాభావం”, “బాధలు”, “మహిమ”. ముఖ్యాంశం విశ్వాసులకు కలిగే బాధలు, వాటి తరువాత మహిమ. కష్టాలలో చిక్కుకొన్న విశ్వాసులకు, బాధలు అనుభవిస్తూ ఉన్న విశ్వాసులకు ఈ లేఖ ఎంతో ప్రోత్సాహకరమైనది, ఉపయోగమైనది.
విషయసూచిక
ఈ లేఖ ఎవరికి రాశాడో వారు 1:1
విశ్వాసుల ఆశాభావం 1:3-9
ఇది కొత్త జన్మం ద్వారా వస్తుంది 1:3
ఇది క్రీస్తు చనిపోయినవారిలోనుంచి లేవడం మీద ఆధారపడినది 1:3
ఇది పరలోకంలోని శాశ్వత వారసత్వానికి సంబంధించినది 1:4
దేవుని శక్తి దీన్ని కాపాడుతూ ఉంది 1:5
గొప్ప ఆనందానికి ఇది కారణం 1:6
నమ్మకం, పరీక్షలు 1:7
క్రీస్తుమీది ప్రేమ, విశ్వాసం, ఆశాభావంతో ముడిపడి ఉన్నాయి 1:8-9
విశ్వాసుల విముక్తి పాత ఒడంబడికలో వెల్లడి అయింది 1:10-12
విముక్తి పొందినవారు ఎలా జీవించాలి 1:13—2:3
సిద్ధంగా ఉండండి 1:13
విధేయులై ఉండండి 1:14
పవిత్రంగా ఉండండి 1:15-16
భయభక్తులతో ఉండండి 1:17
విముక్తి పొందడానికి చెల్లించబడిన వెలను గుర్తుంచుకోండి 1:18-21
ప్రేమతో ఉండండి 1:22
కాలాన్ని గురించీ నిత్యత్వాన్ని గురించీ ఎరిగి ఉండండి 1:23-25
నిజాయితీగా కపటం లేకుండా ఉండండి 2:1
ఎదుగుతూ ఉండండి 2:2-3
సజీవమైన రాయి, సజీవమైన రాళ్ళు 2:4-8
విశ్వాసులంటే ఎవరు 2:9-11
విశ్వాసులుగా వారు ఏమి చేయాలి 2:11-21
యేసు చూపిన మాదిరి 2:22-25
భార్యలు, భర్తలు 3:1-7
ఆశీర్వాదాలను వారసత్వంగా పొందే విధానం 3:8-17
క్రీస్తు మరణం, ఆ తరువాత 3:18-22
కష్టాలకు సిద్ధంగా ఉండడం 4:1-4
దేవుని తీర్పు వస్తుంది 4:5-6
ఈ లోకం అంతం దగ్గర పడినట్టుగా జీవించడం 4:7-11
క్రైస్తవులకు బాధలు రావడం 4:12-19
ఈ బాధలకు మనం ఆశ్చర్యపోకూడదు 4:12
వీటిలో సంతోషించాలి 4:13
ఇది ఆశీర్వాదం అని ఎంచాలి 4:14
దీనిగురించి సిగ్గుపడకూడదు 4:16
దేవుణ్ణి స్తుతించాలి 4:17
మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి 4:18
మనం మంచినే చేస్తుండాలి 4:19
సంఘ నాయకులకు ప్రోత్సాహం 5:1-4
యువకులకు ప్రోత్సాహం 5:5-6
ఆందోళనలను ఎలా ఎదుర్కోవాలి 5:7
సైతానును ఎలా ఎదుర్కోవాలి 5:8-9
ముగింపు మాటలు 5:10-14
No comments:
Post a Comment