Breaking

Sunday, 20 March 2022

బలమైన దేవుడవు బలవంతుడవు నీవు | balamaina dhaevudavu balavmthudavu neevu




balamaina dhaevudavu balavmthudavu neevu


బలమైన దేవుడవు - బలవంతుడవు నీవు
శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారాము
సృజియించినావు నీవు సర్వ సృష్టి కర్తవు నీవు (2)
హల్లెలూయా........హల్లెలూయా (2)
హల్లెలూయా........హల్లెలూయా హోసన్న
హల్లెలూయా........హల్లెలూయా

1. ఎల్‌ ఓలామ్‌ (2)
అల్పా ఓమెగయూ, నిత్యుడైన దేవుడవు (2)
నిత్యనిబంధన చేశావు నిబంధననె స్థిరపరిచావు
నిన్నానేడు రేపు మారని దేవుడవు నీవు(2)
హల్లెలూయా హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా

2. ఎల్‌ షద్దాయ్‌ (2)
పోషించు దేవుడవు ఆశ్రయ దుర్గము నీవు (2)
రెక్కలపై మోసెడి వాడా - రక్షణ శృంగము నీవేగా
నీ మాటున దాచె దేవా మాటను నెరవేర్చేదేవా (2) ||హల్లెలూయా||

3. అడోనాయ్‌ (2)
ప్రభువైన దేవుడవు -ప్రభువులకు ప్రభువు నీవు (2)
సర్వాధికారివి నీవు - సకల జనులకు ప్రభువు నీవు
నీవే నాకు ప్రభువు -నీవేనా యజమానుడవు (2) ||హల్లెలూయా||


No comments:

Post a Comment