Breaking

Thursday, 10 March 2022

2 కొరంతి (పరిచయం)





రచయిత:

ప్రభువైన యేసు క్రీస్తు రాయబారి అయిన పౌలు.


వ్రాసిన కాలం:

క్రీస్తు శకం దాదాపు 57లో.


ముఖ్యాంశం:

కొరింతులోని క్రీస్తు సంఘానికి రాసిన మొదటి లేఖలో అతడు పేర్కొన్న సమస్యలు గాక మరో కఠినమైన సమస్య ఈ సంఘంలో పుట్టింది. అదేమంటే కొందరు దుర్బోధకులు అక్కడికి వచ్చి, పౌలు నిజమైన క్రీస్తు రాయబారి కాడనీ, పౌలు ఉపదేశం సరయింది కాదనీ చెప్పి కొందరిని ఒప్పించారు, సంఘాన్ని ప్రమాదంలోకి దించారు. అందుచేత అక్కడి క్రైస్తవుల మేలుకోసం పౌలు తన రాయబారి పదవికి చెందిన అధికారాన్ని సుస్థిరం చేయవలసి వచ్చింది. అందువల్ల ఇతర లేఖలకంటే ఈ లేఖలో తన విషయం, తన సేవ విషయం ఎక్కువ సంగతులు రాశాడు. తన అనుభవాలనూ ఉద్దేశాలనూ ప్రయాసలనూ బాధలనూ విపులంగా వివరించాడు. ఈ సంగతులు రాస్తూ నిజమైన క్రైస్తవ సేవ ఎలాంటిదై ఉండాలో, దేవుని సేవకులమని చెప్పుకొనేవారు ఎలాంటివారై ఉండాలో స్పష్టం చేశాడు.


విషయసూచిక

కష్టాలలోనూ, బాధలలోనూ ఆదరణ 1:3-11

రద్దయిన పౌలు కొరింతు ప్రయాణం 1:12—2:4

దుఃఖాన్ని కలిగించేవారికి క్షమాపణ 2:5-11

క్రీస్తుద్వారా సామర్థ్యం 2:12—3:6

పాత ఒడంబడికకంటే క్రొత్త ఒడంబడిక ఎంతో గొప్పది 3:7-18

దేవుని సేవకులు: మట్టి పాత్రలలోని దేవుని ఐశ్వర్యం 4:1-8

విశ్వాసుల పరమ నివాసం 5:1-8

పరమ నివాసం కోసం పౌలు లక్ష్యం, కారణాలు 5:9-10

సఖ్యత: దేవుని వంతు, దేవుని సేవకుల వంతు 5:11-21

‘రక్షణ దినం’ ఇదే 6:1-2

పౌలు అనుభవించిన కష్టాలు, అతని జీవిత విధానం 6:3-13

విశ్వాసులు అవిశ్వాసులతో పొందు పెట్టుకోకూడదు 6:14-18

పవిత్రతను సంపూర్తి చేస్తూ ఉండడం 7:1

పౌలు, కొరింతు క్రైస్తవుల పశ్చాత్తాపం 7:2-12

తీతు, కొరింతు క్రైస్తవులు 7:13-16

ధారాళమైన కానుకలు 8:1—9:15

మాసిదోనియాలోని సంఘాల ఉదాహరణ 8:1-5

మాసిదోనియా ఉదాహరణను అనుసరించమని కొరింతువారిని కోరడం 8:6-8

క్రీస్తు ఉదాహరణ 8:9

పౌలు సలహా 8:10-15

పౌలు తీతును కొరింతుకు పంపడం 8:16—9:5

ధారాళంగా ఇచ్చినందువల్ల ఫలితాలు 9:6-15

పౌలు తన రాయబారి పదవిని దృఢపరచడం 10:1—12:21

ఆధ్యాత్మిక పోరాటం 10:3-6

పౌలు “అతిశయం” 10:7-18

కొరింతు విశ్వాసులపట్ల పౌలుకున్న ఆశ, భయం 11:1-3

తప్పుడు రాయబారులు 11:4-6

కొరింతువారిపట్ల పౌలు ప్రవర్తన 11:7-12

తప్పుడు బోధకులు సైతాను సేవకులు 11:13-14

పౌలు మరింత అతిశయం 11:15-22

కష్టాలలోనూ, అపాయాలలోనూ ఆనందించడం 11:23-33

పౌలు పరలోకానికి వెళ్ళిరావడం 12:1-6

పౌలు శరీరంలో ముల్లు 12:7-10

కొరింతు విశ్వాసులపట్ల పౌలు ప్రేమ 12:11-21

ముగింపు మాటలు, అభివందనాలు 13:1-14

No comments:

Post a Comment